IRCTC Poorva Sandhya Tour Packages: కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటారు. దక్షిణ భారతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. అయితే, తిరుమల ప్రయాణమంటే మాటలా? అటు దర్శనంతో పాటు ఇటు ప్రయాణ టికెట్లూ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలంటే అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. కాగా, అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. దర్శన టికెట్ల కోసం చింతించకుండా ఎంచక్కా స్వామి వారిని దర్శించుకోవచ్చు. తిరుమలతో పాటు చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలనూ దర్శించుకోవచ్చు. మరి మీరు కూడా తిరుపతి ప్రయాణానికి సిద్ధమవుతుంటే ఈ ప్యాకేజీపై లుక్కేయండి..
‘పూర్వ సంధ్య టూర్(IRCTC Poorva Sandhya Tour) పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. మొత్తం 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. మే 3వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలను కూడా సందర్శించవచ్చు.
ప్రయాణం ఇలా..
- మొదటి రోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 06:25 గంటలకు రైలు(Train No. 12734 Express) బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌కు 07:05 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ నుంచి 08:35 గంటలకు బయలుదేరుతుంది. నైట్ అంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 06:55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెషప్ అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం ఉంటుంది. ఆ తర్వాత.. శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని సందర్శించాలి. తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేస్తారు.
- మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. 08:30 గంటలకు వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. సాయంత్ర 06:20 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- నాలుగో రోజు ట్రైన్ నల్గొండ స్టేషన్కు తెల్లవారుజామున 03:04 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు 05:35 గంటలకు, లింగంపల్లికి ఉదయం 06:55 గంటలకు రావటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.