IRCTC Vishakhapatnam to Tirumala Tour Package : చాలా మందికి కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీనివాసుడిని దర్శించుకోవాలని ఉంటుంది. సౌత్ ఇండియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. అయితే, తిరుమల ప్రయాణమంటే మాటలా? అటు దర్శనంతోపాటు ఇటు ప్రయాణ టికెట్లూ ఏర్పాటు చేసుకోవాలి. ఫ్యామిలీతో కలిసి వెళ్లాలంటే పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వారి కోసం.. కేవలం రెండ్రోజుల్లోనే శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యేలా ఓ అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఈ టూర్ విమానంలో కొనసాగుతుంది. అంతేకాదు.. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుమలతో(Tirumala)పాటు చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలనూ దర్శించుకోవచ్చు. కాబట్టి.. ఒకవేళ మీరూ తిరుపతి ప్రయాణానికి సిద్ధమవుతుంటే ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి.
"Tirupati Balaji Darshanam Air Package Ex. Vishakhapatnam" పేరుతో.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ రెండు రాత్రులు, 3 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీ విశాఖపట్నం నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్లో భాగంగా తిరుపతితో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయాలనూ సందర్శించవచ్చు. మీరు ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే.. విమానంలో తిరుమల శ్రీనివాసుని దర్శించుకొని తిరిగి విశాఖపట్నం చేరుకోవచ్చు.
టూర్ కొనసాగనుందిలా :
- మొదటి రోజు ఉదయం 10:25 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి విమానం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి రీచ్ అవుతారు.
- అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి ఫ్రెషప్, లంచ్ తర్వాత.. శ్రీనివాస మంగాపురం, కాణిపాకం దేవాలయాలను దర్శించుకుని హోటల్‌కు వస్తారు. నైట్ డిన్నర్ తర్వాత స్టే అక్కడే ఉంటుంది.
- రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ అనంతరం తిరుమల బాలాజీ దర్శనం ఉంటుంది. తర్వాత లంచ్ చేసి శ్రీకాళహస్తి, తిరుచానూరు ఆలయాలను సందర్శించి హోటల్‌కు తిరిగి వస్తారు. నైట్ డిన్నర్ తర్వాత స్టే అక్కడే ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక.. హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి గోవింద రాజ స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్‌ను దర్శించుకుంటారు. లంచ్ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటే.. తిరుపతి నుంచి విశాఖపట్నానికి విమానం బయలుదేరుతుంది. రాత్రి 6:35 నిమిషాలకు విశాఖపట్నం చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ To తిరుపతి - ఉచితంగా శ్రీవారి శీఘ్రదర్శనం - పైగా ఈ ప్రదేశాలు కూడా!