తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రకృతి అందాలకు నిలయమైన 'ఊటీ' చూసొస్తారా? - బడ్జెట్​ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC Ooty Tour Package

IRCTC Ooty Tour Package : ఈ వర్షాకాలంలో ఊటీ వెళ్లాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఊటీ అందాలను చూసి ఎంజాయ్​ చేసేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Ultimate Ooty Ex Hyderabad Package
IRCTC Ooty Tour Package (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 5:07 PM IST

Updated : Jul 22, 2024, 9:16 AM IST

IRCTC Ultimate Ooty Ex Hyderabad Package :సన్నని చినుకులు పడుతుండగా.. పచ్చని ప్రకృతిలో.. ఎత్తైన కొండల మధ్య విహరిస్తే.. ఊహించడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా! మరి అలాంటి ప్రకృతి అందాలకు చిరునామా అయిన ఊటీలో విహరించాలనుకునే వారి కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ అద్దిరిపోయే ప్యాకేజీని అందిస్తోంది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ఏ ఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

"అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్(ULTIMATE OOTY EX HYDERABAD)" పేరిట ఐఆర్‌సీటీసీ(IRCTC)ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతి మంగళవారం హైదరాబాద్​ నుంచి ట్రైన్ ద్వారా జర్నీ ఉంటుంది. ఈ టూర్‌ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది.

ప్రయాణం సాగనుందిలా...

  • మొదటి రోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17230) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 8 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి ఐఆర్‌సీటీసీ సిబ్బంది తీసుకెళ్తారు. ముందుగానే బుక్‌ చేసిన హోటల్​లో చెకిన్​ అవ్వాలి. సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలు వీక్షించొచ్చు. రెండో రోజు రాత్రి ఊటీ హోటల్‌లోనే బస ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం హోటల్‌లోనే బ్రేక్​ఫాస్ట్​ అనంతరం దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతాన్ని వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ ఊటీలోనే బస చేయాలి.
  • నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం కూనూర్‌ పర్యటనకు తీసుకెళ్తారు. తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి మళ్లీ అదే హోటల్‌లో బస ఉంటుంది.
  • ఐదో రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్​ ​చేశాక ఊటీ నుంచి కోయంబత్తూర్‌ పయనమవుతారు. కోయంబత్తూర్​ రైల్వే స్టేషన్​ నుంచి సాయంత్రం 03:55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెం:17229) హైదరాబాద్​కు స్టార్ట్​ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ప్యాకేజీ ధరల విషయానికొస్తే..

  • కంఫర్ట్‌లో (థర్డ్‌ ఏసీ బెర్త్‌) ఒక్కో ప్రయాణికుడికి.. సింగిల్ షేరింగ్​కు రూ.28,940, ట్విన్ షేరింగ్‌కు రూ.16,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,380 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,100, విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,850 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌లో (స్లీపర్‌ బెర్త్‌) సింగిల్ షేరింగ్​కు రూ.26,480, ట్విన్ షేరింగ్‌కు రూ.13,980, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.10,930. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.6,640, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,400 చెల్లించాలి. గ్రూప్‌ బుకింగ్‌పై కొంత మేర తగ్గుతుంది.
  • ప్రస్తుతం ఈ టూర్​ జులై 30 నుంచి సెప్టెంబర్​ 24వరకు అందుబాటులో ఉంది.
  • ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్‌ కోసం ఈ లింక్​పైక్లిక్​ చేయండి

ఇవీ చదవండి :

శ్రావణమాసం స్పెషల్​ : అరుణాచలం TO తంజావూర్​ - అతి తక్కువ ధరకే IRCTC సూపర్​​ ప్యాకేజీ!

షిరిడీ సాయి నాథుని దర్శనంతో పాటు మినీ తాజ్​మహల్​ చూడొచ్చు - IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

Last Updated : Jul 22, 2024, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details