తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​ కోటల రాజసం చూసి తీరాల్సిందే - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC Royal Rajasthan Package - IRCTC ROYAL RAJASTHAN PACKAGE

IRCTC Tour Packages : ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ పర్యాటకుల కోసం ఓ ప్యాకేజీని ప్రకటించింది. రాజస్థాన్‌లో ప్రసిద్ధ కట్టడాలను వీక్షించే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా కల్పిస్తోంది. మరి మీరు కూడా రాజస్థాన్​ వెళ్లాలనుకుంటే ఈ స్టోరీలో ఓ లుక్కేసి వివరాలు తెలుసుకోండి.

IRCTC Tour Packages
IRCTC Tour Packages (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 4:49 PM IST

IRCTC Royal Rajasthan Package: రాజస్థాన్‌ అనగానే మనకు చాలానే గుర్తుకువస్తాయి. రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు.. ఇలా ఎన్నో రాజస్థాన్​ పేరు వింటే మదిలోకి వస్తాయి. అంతేనా ప్రముఖుల వివాహాలు కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. మరి అలాంటి ప్రదేశాలను వీక్షించాలనుకునే వారికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అవకాశం కల్పిస్తోంది. విమాన ప్రయాణంతో పాటు అన్ని వసతులతో ఉండే విధంగా ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రాజస్థాన్​లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఐఆర్​సీటీసీ టూరిజం "‘రాయల్‌ రాజస్థాన్‌ (ROYAL RAJASTHAN)" పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్​నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ను ఆపరేట్​ చేస్తున్నారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌తో పాటూ ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌ వంటి నగరాలను సందర్శించొచ్చు. 5 రాత్రులు, 6 పగళ్లతో ఈ టూర్‌ ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..

హైదరాబాద్​ నుంచి విమాన ప్రయాణం ఇలా..

  • హైదరాబాద్‌ ఎయిర్​పోర్ట్​ నుంచి తెల్లవారుజామున 4:45 గంటలకు విమానం (6E 815) బయల్దేరుతుంది. 6:40 గంటలకు జైపూర్ విమానాశ్రయం చేరతారు. అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. ఫ్రెషప్​ అనంతరం జైపూర్​ సిటీ ప్యాలెస్​ సందర్శిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుని మధ్యాహ్నం భోజనం పూర్తి చేసి అమేర్‌ ఫోర్ట్‌ చూడటానికి వెళ్తారు. తిరిగి అదే హోటల్‌లో భోజనం,రాత్రి బస ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ పూర్తి చేసుకున్నాక హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి పుష్కర్​కు బయలుదేరుతారు. హోటల్​లో చెకిన్​ అయ్యి అక్కడ బ్రహ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రోజు సాయంత్రం అక్కడే షాపింగ్‌ చేసుకొని తిరిగి హోటల్‌ చేరుకోవాలి. రాత్రి భోజనం, బస ఆ హోటల్​లోనే ఉంటుంది.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత జోధ్‌పూర్‌కు బయల్దేరుతారు. మెహ్రాన్‌ఘర్ కోటను సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్​లో చెకిన్​ అవుతారు. రాత్రికి భోజనం, స్టే జోధ్​పూర్​లో ఉంటుంది.

ఖజురహో అందాలు చూస్తారా? - హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా తక్కువే!

  • నాలుగో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి ఉమైద్ భవన్ ప్యాలెస్ అందాలు వీక్షిస్తారు. అక్కడి నుంచి రణక్​ పూర్​ బయలుదేరుతారు. రణక్​పూర్​లో జైన దేవాలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఉదయ్​పూర్​ స్టార్ట్​ అవుతారు. ఉదయ్​పూర్​ చేరుకుని హోటల్​లో చెకిన్​ అయ్యి.. రాత్రికి భోజనం, స్టే అక్కడే చేస్తారు.
  • ఐదో రోజు హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సిటీ ప్యాలెస్​ అందాలు వీక్షిస్తారు. మధ్యాహ్నం నాథ్​ద్వారా వెళ్తారు. అక్కడ స్టాచ్యూ ఆఫ్​ బిలీఫ్ దర్శించుకుంటారు. తిరిగి ఉదయ్​పూర్​ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉదయపూర్‌లో ఏర్పాటు చేసిన హోటల్‌లో స్టే ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి సహేలియోన్‌ కీ బరీ చూస్తారు. ఆ తర్వాత ఎయిర్​పోర్ట్​కు స్టార్ట్​ అవుతారు. సాయంత్రం 4:45 గంటలకు విమానం(6E 814) హైదరాబాద్​కు స్టార్ట్​ అవుతుంది. సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ఇవి ప్యాకేజీలో భాగమే..

హైదరాబాద్‌- జైపూర్‌/ ఉదయ్​పూర్​- హైదరాబాద్‌ ఫ్లైట్​ టికెట్లు.

జైపూర్‌, పుష్కర్​, జోధ్‌పుర్‌లో, ఉదయ్‌పుర్‌ హోటల్‌ బస.

ఈ ప్యాకేజీ 6 బ్రేక్​ఫాస్ట్​లు, 1 లంచ్​, 5 రాత్రి భోజనాలు ఉంటాయి.

పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఏసీ బస్సును ఐఆర్‌సీటీసీనే ఏర్పాటు చేస్తుంది.

ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌ అందుబాటులో ఉంటారు.

ప్యాకేజ్‌ ఛార్జీలు.. (ఒక్కొక్కరికీ)

  • రూమ్‌లో సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే రూ.41,950, ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.32,900, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.31,650 చెల్లించాలి.
  • ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.28,650, విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.25,500 చెల్లించాలి. 2-4 సంవత్సరాల మధ్య చిన్నారులకు రూ.19,400 చెల్లించాలి.
  • ఈ టూర్​ సెప్టెంబర్​ 23న మొదలవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి, ప్యాకేజీ బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

బ్యాంకాక్ చూసొద్దామా బాసూ..? - IRCTC సూపర్ ప్యాకేజీ! - సఫారీ వరల్డ్ టూర్ కూడా!

ABOUT THE AUTHOR

...view details