IRCTC Mystical Kashmir Ex Hyderabad Tour:నార్త్ ఇండియాలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. శ్రీనగర్ అందాలు.. మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం.. అబ్బో ఊహించుకుంటేనే మంచులో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. ఇక, నేరుగా ఆస్వాదిస్తే? ఆ మజానే వేరు. ఆ అందాల్ని అస్వాదించాలనుకునే వారికోసం IRCTC సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. మరి టూర్ ప్రయాణం ఎన్ని రోజులు? ధర ఎంత? ఏయే ప్రదేశాలు కవర్ అవుతాయి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
"కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్" పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. జూన్ 19న హైదరాబాద్ నుంచి విమానం ప్రయాణం ద్వారా ఈ టూర్ మొదలవుతుంది. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు 6 పగళ్లు కొనసాగుతుంది.
విమాన ప్రయాణం వివరాలు ఇలా..
- హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు విమానం (6E- 108) బయల్దేరుతుంది. సాయంత్రం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుతారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు.
- ఫ్రెషప్ తర్వాత సూర్యాస్తమయాన్ని వీక్షించటానికి సాయంత్రం దాల్ సరస్సుకు తీసుకెళ్తారు. అక్కడున్న చార్-చినార్ (ప్లోటింగ్ గార్డెన్స్) వీక్షించొచ్చు. అయితే ఇక్కడ రుసుములు యాత్రికులే చెల్లించాలి. రాత్రి శ్రీనగర్ హోటల్‌లోనే బస ఉంటుంది.
- రెండో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బంగారు గడ్డి మైదానంగా పేరొందిన సోన్‌మార్గ్‌కు తీసుకెళ్తారు. అక్కడ మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, మంచుతో కప్పిన రోడ్లను చూసి మైమరిచిపోవచ్చు.
- ఈ పర్యటనలో తాజ్వాస్ గ్లేసియర్ (హిమానీనదం) ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వీటిని చూసిన తర్వాత శ్రీనగర్‌కు వచ్చి హోటల్లో స్టే చేస్తారు. రాత్రికి అక్కడే భోజనం ఉంటుంది.
- మూడో రోజు ఉదయం గుల్‌మార్గ్‌కు బయల్దేరుతారు. అక్కడ పూలతో నిండిన రోడ్ల మార్గం ద్వారా ప్రయాణించి గుల్‌మార్గ్ గోండోలాకు చేరుతారు. అక్కడ రోప్‌వే ప్రయాణం మైమరిపిస్తుంది. దానికి యాత్రికులే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత రాత్రి తిరిగి శ్రీనగర్ చేరడంతో మూడోరోజు పర్యటన ముగుస్తుంది.