తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామేశ్వరం - శ్రీలంక ఫెర్రీ సర్వీస్ - అక్కడి తమిళుల ఆకాంక్షలు నెరవేర్చండి : ప్రధాని మోదీ - MODI ANURA KUMARA MEETING

మొదటిసారి భారత్‌కు రావడం ఆనందంగా ఉంది: అనుర కుమార దిసనాయకే

Modi Anura Kumara Meeting
Modi Anura Kumara Meeting (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Modi Anura Kumara Meeting : ఇరుదేశాల మధ్య ఉన్న రక్షణ, ఇంధనం, వాణిజ్య సంబంధాలను భవిష్యత్ దృష్టికోణంలో మరింత విస్తరించుకోవాలని భారత్‌, శ్రీలంక నిర్ణయించుకున్నాయి. త్వరలోనే రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, మల్టీ-ప్రొడక్ట్‌ పెట్రోల్ పైప్‌లైన్‌లను ఏర్పాటుచేసి ఇంధన సంబంధాలను కూడా పెంచుకోవాలని భావిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో నిర్ణయాలు తీసుకున్నారు.

ఆర్థిక భాగస్వామ్యం
'భారత్‌-శ్రీలంకల మధ్య ఆర్థిక భాగస్వామ్యానికి పెట్టుబడి ఆధారిత వృద్ధి అవసరమని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఫిజికల్, డిజిటల్‌, ఎనర్జీ కనెక్టివిటీ అనేవి ఇరుదేశాల ఆర్థిక సంబంధాలకు మూల స్తంభాలుగా ఉండాలి' అని ప్రధాని మోదీ అన్నారు.

ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీ, మల్టీ ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామని, దీని ద్వారా శ్రీలంకకు ద్రవీకృత సహజ వాయువు (లిక్విఫైడ్‌ నేచురల్ గ్యాస్‌)ను సరఫరా చేస్తామని మోదీ చెప్పారు.

భారత్‌-శ్రీలంకల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు రామేశ్వరం - తలైమానార్‌ మధ్య ఫెర్రీ సర్వీస్‌లను ప్రారంభించున్నట్లు మోదీ ప్రకటించారు.

రక్షణ భాగస్వామ్యం
'ఇరుదేశాల భద్రతా ప్రయోజనాలు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. అందుకే రక్షణ సహకార ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసుకోవాలని మేము నిర్ణయించాం. ఇప్పటికే హైడ్రోగ్రఫీ సహకారం కోసం ఒప్పందం కుదిరింది' అని మోదీ అన్నారు.

మత్స్యకారుల సమస్యలు
ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మధ్య మత్స్యకారుల సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన అంశంలో మానవతా దృక్పథంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చాయి.

తమిళ్‌ ఇష్యూ
తమిళుల సమస్యల విషయంలోనూ ఇరువురు నేతలు చర్చించారు. 'శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని భారత్ ఆశిస్తోంది' అని మోదీ అన్నారు.

'భారతదేశం ఇప్పటి వరకు శ్రీలంకకు 5 బిలియన్‌ డాలర్ల విలువైన గ్రాంట్లు, క్రెడిట్ లైన్స్ ఇచ్చింది. శ్రీలంకలోని ఓ 25 జిల్లాల్లో మాకు పూర్తి సహకారం ఉంది. మా ప్రాజెక్ట్‌ల ఎంపిక ఎల్లప్పుడూ మా భాగస్వామ్య దేశాల ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది' అని మోదీ అన్నారు.

భారత్‌కు రావడం ఆనందంగా ఉంది!
"శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత, ఇదే నా మొదటి విదేశీ పర్యటన. భారత్‌లో పర్యటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. పబ్లిక్ సర్వీస్‌లను డిజటలైజ్ చేయడంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీలంక కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఈ ప్రయత్నంలో శ్రీలంకకు భారత్‌ మద్దతుగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు" అని అనుర కుమార దిసనాయకే అన్నారు.

ABOUT THE AUTHOR

...view details