ETV Bharat / bharat

ఆయనను ఇకపై ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా గుర్తించొద్దు: సుప్రీంకోర్టు - M S SUBBULAKSHMI AWARD

గాయకుడు టీఎం కృష్ణను సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా గుర్తించకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు

MS Subbulakshmi Award Issue
MS Subbulakshmi Award Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

MS Subbulakshmi Award Issue : దివంగత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా కర్ణాటక గాయకుడు టీఎం కృష్ణను గుర్తించకూడదని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణ, మ్యూజిక్ అకాడమీ, ది హిందూ, THG పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ నుంచి నాలుగు వారాల్లోగా వివరణ కోరుతూ ధర్మాసనం నోటీసు జారీ చేసింది. సుబ్బులక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అవార్డు వెనక్కి తీసుకోవాలని సుబ్బులక్ష్మి మనవడు శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్​వీన్​ భట్టితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీన్ని అసాధారణ విషయంగా పరిగణించాలని, కృష్ణ సుబ్బులక్ష్మిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కథనాలు రాశారని అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్​ వెంకటరామన్ వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం టీఎం కృష్ణను సుబ్బులక్ష్మి అవార్డు గ్రహీతగా గుర్తించకూడదని ఆదేశించింది. కృష్ణకు అవార్డును ప్రదానం చేసేలా అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణ స్వతహాగా గొప్ప గాయకుడు అని, అందులో ఎలాంటి సందేహం లేదని జస్టిస్ భట్టి తెలిపారు. ఈ ఉత్తర్వులు కృష్ణ గాన సామర్థ్యాలకు ప్రతిబింబంగా చూడరాదని జస్టిస్ రాయ్ వ్యాఖ్యానించారు.

2004లో సుబ్బ‌ుల‌క్ష్మి మ‌ర‌ణం త‌ర్వాత ఆమె పేరిట 2005 నుంచి చెన్నైకి చెందిన మ్యూజిక్ అకాడ‌మీ అవార్డు అందిస్తుంది. ఆ అవార్డు కింద ల‌క్ష రూపాయలు ప్రైజ్‌ మ‌నీ కూడా ఇస్తుంది. అలా 2024కి గాను టీఎం కృష్ణ‌కు అవార్డు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ వెంటనే ఎంఎస్ సుబ్బ‌ుల‌క్ష్మి మ‌న‌వ‌డు శ్రీనివాస‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కృష్ణ‌కు అవార్డు ఇవ్వ‌వ‌ద్దంటూ మ‌ద్రాసు హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

గతంలో సుబ్బ‌ుల‌క్ష్మిపై టీఎం కృష్ణ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. అలాంటి వ్య‌క్తిని ఎలా ఆమె అవార్డుతో స‌త్క‌రిస్తార‌ని శ్రీనివాస‌న్ ప్ర‌శ్నించారు. సుబ్బ‌ుల‌క్ష్మి వీలునామా ప్ర‌కారం ఎటువంటి స్మార‌క సంస్థ ఉండ‌కూడ‌ద‌ని, ఆమె పేరిట ఫండ్‌ను ఏర్పాటు చేయ‌డాన్ని కూడా వ్య‌తిరేకించిన‌ట్లు శ్రీనివాసన్ తెలిపారు. అయితే మద్రాసు హైకోర్టు కృష్ణకు అవార్డు ఇచ్చేందుకు అనుమతులు ఇవ్వగా, ఆదివారం అందించారు. ఆ తర్వాత శ్రీనివాసన్ సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.