SP MP Awadhesh Bursts Into Tears :సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అయోధ్య(ఫైజాబాద్) ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటీవల కనిపించకుండా పోయిన అయోధ్యకు చెందిన ఓ యువతి మృతదేహం అత్యంత దారుణ స్థితిలో దొరకిన నేపథ్యంలో ఎంపీ ఆవేదనకు లోనయ్యారు. యువతి కనపడకుండాపోయి రెండు మూడు రోజులు అవుతున్నా ఆమెను కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఆ యువతి దారుణంగా హత్యాచారానికి గురయినట్లు పేర్కొంటూ విలపించారు. ఈ విషయంపై దిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని, యువతిని కాపాడలేనందున పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. పక్కనే ఉన్న పార్టీ నేతలు ఆయనను సముదాయించారు. మృతురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయడానికి పోరాటం చేయాలని సూచించారు.
'పార్లమెంట్లో ప్రధానిని ప్రశ్నిస్తా!- అలా జరగకపోతే రాజీనామా చేస్తా' - ప్రెస్ ముందు గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ! - SP MP AWADHESH BURSTS INTO TEARS
అయోధ్యలో యువతి దారుణ హత్య- కన్నీటి పర్యంతమైన ఎంపీ
!['పార్లమెంట్లో ప్రధానిని ప్రశ్నిస్తా!- అలా జరగకపోతే రాజీనామా చేస్తా' - ప్రెస్ ముందు గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ! SP MP Awadhesh Prasad bursts into tears](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-02-2025/1200-675-23458009-thumbnail-16x9-sp-mp.jpg)
Published : Feb 2, 2025, 3:55 PM IST
అసలు ఏం జరిగింది?
అయోధ్య ప్రాంతానికి చెందిన ఓ యువతి(22) గురువారం రాత్రి కనిపించకుండాపోయింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. వివస్త్రగా ఉన్న యువతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు తమ గ్రామానికి కొంత దూరంలో ఉన్న కాలువలో గుర్తించారు. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టివేసి ఉన్నాయని, తమ బిడ్డను అమానుషంగా హత్య చేశారని వారు పేర్కొన్నారు. శరీరంలోని వివిధ భాగాలపై లోతైన గాయాలున్నట్లు గుర్తించామని తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారని అన్నారు. పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆ గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.