తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కోమాలో ఉన్న భర్త ఆస్తిని భార్య అమ్ముకోవచ్చు'- కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు - Madras HC On Husband Property Case - MADRAS HC ON HUSBAND PROPERTY CASE

Madras HC On Husband Property Case : కోమాలో ఉన్న భర్త ఆస్తి విక్రయించేందుకు భార్యకు హక్కు ఉందని మద్రాసు హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. కోమాలోకి వెళ్లిన భర్త ఆస్తులకు తనను గార్డియన్​గా నియమించాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Husband Property Guardian Case
Husband Property Guardian Case (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 7:36 AM IST

Updated : May 30, 2024, 8:19 AM IST

Madras HC On Husband Property Case : కోమాలో ఉన్న భర్త ఆస్తిని విక్రయించేందుకు భార్యకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిన భర్త ఆస్తులకు తనను గార్డియన్​గా నియమించాలని కోరుతూ ఓ మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు భర్త ఆస్తుల నిర్వహణకు భార్యకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే భర్త ఆస్తిని విక్రయించేందుకు అనుమతించింది.

ఇదీ కేసు
తమిళనాడు చెన్నైకి చెందిన శశికళ అనే మహిళ కోమాలోకి వెళ్లిన భర్త ఆస్తులకు గార్డియన్‌గా నియమించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన సింగిల్​ బెంచ్ జడ్జి అందుకు చట్టంలో స్థానం లేదని తెలిపారు. సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ పిటిషన్​ను ఏప్రిల్​ 23న కొట్టివేశారు.

దీనిపై శశికళ అప్పీల్​కు వెళ్లగా జస్టిస్​ స్వామినాథన్, జస్టిస్​ బాలాజీల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. చట్టంలో దీనిపై ఏ మార్గం లేకపోయినా ఆస్తులకు సంరక్షకురాలు అనేలా కోర్టు ఉత్తర్వులు ఇవ్వొచ్చని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. ఈ క్రమంలోనే భర్త ఆస్తుల నిర్వహణకు భార్యకు అనుమతినిచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. శశికళను తన భర్త ఆస్తులకు గార్డియన్​గా నియమించి, రూ.కోటి విలువైన ఆస్తిని విక్రయించేందుకు అనుమతించింది. రూ.కోటి విలువైన ఆస్తిని విక్రయించేందుకు అనుమతించింది. అందులో రూ.50 లక్షలు శివకుమార్‌పై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వచ్చే వడ్డీ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అలాగే నగదును కేవలం తన భర్త, పిల్లలు, కుటుంబ పోషణకు మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది.

'కలిసి ఫొటో దిగినంత మాత్రాన అంతా బాగున్నట్లు కాదు'
ఇటీవల కర్ణాటకలో హైకోర్టు దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని ఒక ఫొటో ఆధారంగా నిర్ధరించలేమని చెప్పింది. ఫొటోను బట్టి దంపతుల మధ్య ఉన్న బంధంపై స్పష్టతకు రావడం కుదరదని అభిప్రాయపడింది. దంపతులకు విడాకులు మంజూరు చేసింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

CAA అమలు వేగవంతం- రెండో విడతలో మూడు రాష్ట్రాల లబ్ధిదారులకు భారత పౌరసత్వం

ఉచితంగా నెలకు అకౌంట్​లో రూ.8,500- పోస్టాఫీస్​కు క్యూ కట్టిన మహిళలు- ఎక్కడంటే? - congress mahalakshmi rumours

Last Updated : May 30, 2024, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details