How To Make Sause Free Yoga Chicken Recipe : చికెన్‌తో ప్రిపేర్ చేసే రెసిపీలు ఎన్నో. కానీ, చాలా మంది ఇంట్లో కర్రీ, ఫ్రై వంటి వంటకాలను మాత్రమే తయారు చేస్తుంటారు. ఇక ఎప్పుడూ చికెన్‌తో అవే చేస్తే చాలా బోర్ అనిపిస్తుంది. తినాలన్న ఇంట్రస్ట్ కూడా ఉండదు. అందుకే ఇకపై అటువంటి ఫీలింగ్ లేకుండా ఉండడానికి మీ కోసం ఒక కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే "యోగా చికెన్". ఈ రెసిపీ పేరు డిఫరెంట్‌గా ఉన్నా.. రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పైగా వీటిని తయారు చేయడానికి ఎటువంటి సాస్‌లు అవసరం లేదు. మరి ఈ రెసిపీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఎంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బోన్‌లెస్ చికెన్ - పావు కిలో
- గుడ్డు- 1
- మిరియాల పొడి - టీస్పూన్
- కారం - టేబుల్‌స్పూన్
- ఉప్పు రుచికి సరిపడా
- కార్న్‌ఫ్లోర్- టేబుల్‌స్పూన్
- మైదా- 2 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి-5
- వైట్ పెప్పర్ పౌడర్-టీస్పూన్
- పెరుగు- అర కప్పు
- పసుపు- అర టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు- 4
- ఉల్లిపాయ - ఒకటి
- అల్లం వెల్లుల్లి పేస్ట్-అర టీస్పూన్
- నూనె- వేయించడానికి సరిపడా
- జీడిపప్పు - అరకప్పు
తయారీ విధానం :
- ముందుగా చికెన్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో ఎగ్‌ని పగలగొట్టి.. పొడవాటి చికెన్ ముక్కలని అందులో వేయండి.
- తర్వాత ఇందులో మిరియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని బాగా కలుపుకోండి.
- తర్వాత ఇందులోకి కార్న్‌ఫ్లోర్, మైదా పిండి వేసుకుని నీరు వేయకుండా కలుపుకోండి. ఒకవేళ పిండి గట్టిగా అయితే కొన్ని నీళ్లు కలుపుకుని పిండి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఒక పాన్‌లో చికెన్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేయండి.
- నూనె వేడెక్కాక చికెన్ ముక్కలని వేసి డీప్ ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అరకప్పు జీడిపప్పులను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి.
- తర్వాత అదే పాన్‌లో మరికొంచెం నూనె వేసుకుని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. అలాగే చీలిన పచ్చి మిర్చిలు, ఉల్లి పాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి.
- ఇప్పుడు ఇందులోకి బాగా చిలికిన పెరుగు వేసుకుని కలపండి. పెరుగు మిశ్రమం కొద్దిగా చిక్కగా మారిన తర్వాత కొద్దిగా ఉప్పు, వైట్ పెప్పర్ పౌడర్ వేసుకుని మిక్స్ చేయండి.
- తర్వాత ఇందులోకి డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ స్ట్రిప్స్ వేసుకుని బాగా కలుపుకోండి.
- చికెన్‌కి మసాలా మిశ్రమం బాగా పట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, ఫ్రై చేసుకున్న జీడిపప్పులు వేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీ క్రిస్పీ యోగా చికెన్ రెడీ.
- ఎలాంటి సాస్‌లు లేకుండా.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఈజీగా చేసే ఈ రెసిపీని మీరు కూడా ఓ సారి ట్రై చేయండి మరి..