Green Masala Fish Fry Making Process: సండే వచ్చేసింది. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అంటూ రకరకాలు వండుకుని తింటుంటారు నాన్‌వెజ్ ప్రియులు. అయితే మాంసాహారుల్లో ఫిష్ కర్రీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చేపల పులుసు, ఫ్రై పేరు చెప్పగానే మౌత్ వాటరింగ్ అయిపోతుందంటే నమ్మాల్సిందే. మరి మీరు కూడా ఈ లిస్టులో ఉంటే.. ఈ సండే లంచ్‌లోకి మెనూ కార్డ్‌లో గ్రీన్ మసాలా చేపల ఫ్రై చేర్చండి. తయారీ గురించి నో టెన్షన్. అద్దిరిపోయేలా.. చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో క్లారిటీగా మేం చెప్తాం. కరెక్టుగా చేస్తే.. ప్లేట్లు ఖాళీ కావాల్సిందే. మరి, ఈ ఫిష్ ఫ్రై కి కావాల్సిన ఐటమ్స్.. ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం..
గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:
- చేపలు: 1 kg
- చిన్న ఉల్లిపాయలు - 10
- పచ్చిమిర్చి - 5
- కొత్తిమీర - గుప్పెడు
- పుదీనా - గుప్పెడు
- అల్లం - 1 చిన్న ముక్క
- వెల్లుల్లి - 6 రెబ్బలు
- మిరియాలు - 1/2 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- నిమ్మరసం - 1/2 టీ స్పూన్
- కారం - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - 2 రెమ్మలు
- నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా చేపలను ఉప్పు, నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి.
- తర్వాత మిక్సీ జార్లో చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత కడిగిన చేప ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకుని వాటిపై రుబ్బిన ఉల్లిపాయల పేస్ట్, నిమ్మరసం, కారం పొడి వేసి బాగా కలిపి కనీసం 1 గంట పాటు పక్కకు పెట్టుకోవాలి.
- గంట తర్వాత స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి, అందులో ఫ్రైకి కావల్సినంత నూనె పోసి, వేడయ్యాక కరివేపాకు వేసి, దాని పైన చేప ముక్కను వేసి వేయించాలి.
- ఒకవైపు వేగాక మరోవైపు తిప్పుకుని ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ వేయించుకుంటే రుచికరమైన గ్రీన్ మసాలా ఫిష్ ఫ్రై రెడీ.