How To Make Chicken Pickle Recipe :ఎక్కువ మంది మాంసాహార ప్రియులు నాన్‌వెజ్ పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వేడివేడి అన్నంలో చికెన్ పచ్చడితో తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే.. నాన్‌వెజ్‌లో ఎన్ని రకాల పచ్చళ్లున్నా.. చికెన్ పచ్చడి రుచి అద్భుతంగా ఉండడమే దీనికి కారణం. అయితే, చాలా మందికి చికెన్ పచ్చడి చేయడం రాదు. అదేదో పెద్ద ప్రాసెస్ అని ఎప్పుడూ ఈ పచ్చడి ట్రై చేయరు. కానీ, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే.. ఎంతో సింపుల్‌గా చికెన్ పచ్చడిని మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అలాగే ఈ పచ్చడి కనీసం రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది! మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే చికెన్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
చికెన్ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు :
- బ్రాయిలర్ చికెన్- కేజీ
- నూనె- అర కేజీ
- పసుపు-టీస్పూన్
- మెంతి పొడి- టేబుల్‌స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 5 టేబుల్ స్పూన్లు
- ఉప్పు- 50 గ్రాములు
- నిమ్మరసం - 3 టేబుల్‌స్పూన్లు
- కారం - 50 గ్రాములు
ఆంధ్రా స్టైల్ చికెన్ పచ్చడి తయారీ విధానం :
- ముందుగా చికెన్‌ని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత నాన్‌స్టిక్ పాన్‌లో చికెన్ వేసి అర టేబుల్‌స్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు వేసి సన్నని మంట మీద.. చికెన్ ముక్కల్లో ఉన్న తడి పూర్తిగా ఆవిరయ్యే వరకు ఫ్రై చేసుకోండి.
- ఇప్పుడు మందపాటి కడాయిలో అర కేజీ ఆయిల్ హీట్ చేసి.. కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోండి. చికెన్ క్రిస్పీగా ఫ్రై కావాలి.
- తర్వాత చికెన్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు అదే ఆయిల్లో అర కప్పు (దాదాపు 60 గ్రాములు) ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి.
- అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసి రెండు నిమిషాల తర్వాత, మెంతి పొడి వేసుకుని కలుపుకోండి.
- ఈ ప్రాసెస్‌లో మీకు నచ్చితే.. టేబుల్‌స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు 50 గ్రాముల ఉప్పు వేసుకుని బాగా కలపండి. 50 గ్రాముల కారం కలుపుకుని స్టౌ ఆఫ్ చేయండి.
- ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండి.. ఎయిర్‌టైట్ సీసాలో స్టోర్ చేసుకోండి.
- చాలా సింపుల్‌గా ఇలా చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది.