తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రెషర్​ కుక్కర్​లో చికెన్​ బిర్యానీ - పిల్లలు కూడా ఈజీగా వండేస్తారు! - Chicken Biryani Recipe In Cooker - CHICKEN BIRYANI RECIPE IN COOKER

Chicken Biryani Recipe In Pressure Cooker : చికెన్​ దమ్​ బిర్యానీ వండడం అంటే అదో పెద్ద ప్రాసెస్. అందుకే.. ఎప్పుడైనా బిర్యానీ చేయమని పిల్లలు అడిగితే.. "అంత టైమ్ లేదు" అంటారు అమ్మలు! కానీ.. ఇప్పుడు మేం చెప్పే పద్ధతిని ఫాలో అయ్యారంటే చాలా త్వరగా బిర్యానీ రెడీ అయిపోతుంది!!

Chicken Biryani Recipe
Chicken Biryani Recipe In Pressure Cooker (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 1:13 PM IST

How To Make Chicken Biryani Recipe In Cooker : చికెన్ దమ్​​ బిర్యానీ అంటే చాలు.. పిల్లల దగ్గరి నుంచి పెద్దలవరకు అందరూ ప్లేట్లు పట్టుకొని సిద్ధమైపోతారు. కానీ.. ప్రిపరేషన్ ఎంత శ్రమతో కూడుకున్నదో.. వంటింట్లో వండే వారికే తెలుస్తుంది. అయితే.. చాలా సింపుల్​గా ప్రెషర్​ కుక్కర్లో బిర్యానీని వండే పద్ధతిని మీకోసం తీసుకొచ్చాం. మరి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - అర కేజీ
  • ఉప్పు- రుచికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూన్
  • కారం- టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి - టేబుల్ స్పూన్
  • పసుపు - టీస్పూన్
  • గరం మసాలా పొడి- టీస్పూన్
  • బిర్యానీ మసాలా - టీస్పూన్
  • పెరుగు -2 టేబుల్ స్పూన్లు
  • బాస్మతీ రైస్ -2 గ్లాసులు
  • నూనె- 3 టేబుల్​స్పూన్లు
  • సాజీర- టీస్పూన్‌
  • బిర్యానీ ఆకు
  • దాల్చిన చెక్క
  • లవంగాలు -4
  • జాపత్రి కొద్దిగా
  • యాలకులు -4
  • బిర్యానీ పువ్వు కొద్దిగా
  • పచ్చిమిర్చి -5
  • ఉల్లిపాయలు -3
  • అనాస పువ్వు - ఒకటి
  • టమాటా -1
  • కరివేపాకు- 1
  • కొత్తిమీర కొద్దిగా
  • పుదీనా
  • నెయ్యి -2 టీస్పూన్లు

చికెన్​ బిర్యానీ తయారీ విధానం :

  • ముందుగా బాస్మతీ బియ్యాన్ని రెండు సార్లు కడిగి.. కొన్ని నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోండి.
  • తర్వాత ఒక గిన్నెలో శుభ్రం చేసిన చికన్​ తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు,​ చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం పిండి బాగా కలపండి. దీన్ని 30 నిమిషాలు ఫ్రిడ్జ్​లో పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టౌ పై కుక్కర్​ పెట్టి అందులో ఆయిల్​ వేసి.. సజీరా, యాలకులు, జాపత్రి, బిర్యానీ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఆయిల్​లో మీకు నచ్చితే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి.
  • ఉల్లిపాయలు గోల్డెన్​ బ్రౌన్​ కలర్​లోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కలపండి. ఆ తర్వాత మ్యారినేట్​ చేసుకున్న చికెన్​ వేయండి. అలాగే టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించుకోండి.
  • ఇప్పుడు కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలపండి.
  • అలాగే మీరు ఏదైతే గ్లాసు​ కొలతతో బాస్మతి రైస్​ తీసుకున్నారో.. ఆ గ్లాసుకు ఒకటిన్నర గ్లాసు నీళ్లను మరొక గిన్నెలో బాగా మరిగించుకోండి. మీరు నార్మల్​ రైస్ ఉపయోగిస్తే.. ఒక గ్లాసుకు రెండుగ్లాసుల నీళ్లను మరిగించుకుంటే సరిపోతుంది.
  • తర్వాత చికెన్​లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలపండి. అలాగే నానబెట్టుకున్న రైస్​ని వేసి మిక్స్​ చేయండి. ఇప్పుడు బాగా మరిగించుకున్న వాటర్​ని పోసి.. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత కుక్కర్​ మూత పెట్టి సన్నని మంట మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. మీ కుక్కర్​ విజిల్​ రాకపోతే.. 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకుని స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా కుక్కర్లో చికెన్​ బిర్యానీ చేస్తే వేడివేడిగా బిర్యానీ రెడీ. దీనిని సర్వ్​ చేసుకునే ముందు నెయ్యి చల్లుకుంటే సరిపోతుంది.
  • నచ్చితే మీరు కూడా ఒకసారి ప్రెషర్​ కుక్కర్లో చికెన్​ బిర్యానీని ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details