తెలంగాణ

telangana

రెస్టారెంట్​ స్టైల్లో​ ఆలూ 65 - ఇలా చేశారంటే ఇంట్లో వాళ్లందరూ వావ్ అనాల్సిందే! - RESTAURANT STYLE ALOO 65 RECIPE

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 11:59 AM IST

Aloo 65 Recipe : పొటాటో ఫ్రై, కర్రీల రుచి ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈసారి కొత్తగా పొటాటోలతో క్రిస్పీగా, జ్యూసీగా ఉండే రెస్టారెంట్​ స్టైల్​ ఆలూ 65 రెసిపీని ట్రై చేయండి. ఇంట్లోనే సింపుల్​గా ఆలూ 65 ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Aloo 65 recipe
How To Make Aloo 65 recipe (ETV Bharat)

How To Make Aloo 65 recipe :ఇప్పటి వరకు మీరు బంగాళా దుంపలతో చేసిన వివిధ రకాల ఫ్రైలు, కర్రీ రెసిపీలను టేస్ట్​ చేసి ఉంటారు. అలాగే ఇంట్లోనే స్ట్రీట్​ ఫుడ్​ స్టైల్లో​ ఫ్రెంచ్​ ఫ్రైస్​, చిప్స్​ తయారు చేసి వాటి రుచిని ఆస్వాదించి ఉంటారు. అయితే, ఆలూతో మీరు ఎప్పుడూ రుచి చూడని ఒక కొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాం. అదే ఆలూ 65 రెసిపీ. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఆలూ 65 చేస్తే.. రెస్టారెంట్లలో చేసిన టేస్ట్​ తప్పకుండా వస్తుంది. ఈ రెసిపీని సాయంత్రం స్నాక్స్​గా కూడా తినొచ్చు. బయట క్రిస్పీ, క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్​గా ఉండే ఈ ఆలూ 65 టేస్ట్​ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఇంట్లోనే ఈజీగా ఆలూ 65 రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి!

ఆలూ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • బంగాళా దుంపలు- పావు కేజీ
  • మైదా పిండి- రెండు టేబుల్​స్పూన్లు
  • బియ్యం పిండి - రెండు టేబుల్​స్పూన్లు
  • కార్న్​ ఫ్లోర్​- రెండు టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర పొడి- అర టీస్పూన్​
  • పసుపు- చిటికెడు
  • గరం మసాలా- అర టీస్పూన్​
  • ధనియాల పొడి-అర టీస్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు- 5
  • కారం- టీస్పూన్​
  • పచ్చిమర్చి-6
  • పెరుగు-కప్పు
  • కొత్తమీర
  • కరివేపాకు
  • రెడ్​ కలర్​- కొద్దిగా
  • ఎండు మిర్చి- 2
  • నూనె సరిపడినంత
  • ఉప్పు -రుచికి సరిపడా
  • నిమ్మరసం- టేబుల్​స్పూన్

పొటాటో 65 తయారీ విధానం :

  • ముందుగా పొటాటోలపైన ఉన్న చెక్కు తీసుకుని.. వాటిని సమానంగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత స్టౌ పై గిన్నెలో నీళ్లు పోసి.. కట్ చేసుకున్న పొటాటో ముక్కలని వేసి ఒక 80 శాతం వరకు ఉడికించుకోండి.
  • తర్వాత పొటాటో ముక్కలను నీళ్లలో నుంచి తీసి చల్లారనివ్వండి. బంగాళా దుంప ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత.. కార్న్​ ఫ్లోర్​, మైదా పిండి, బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు చిలకరిస్తూ ముక్కలకు పిండి పట్టించండి.
  • ఇప్పుడు పాన్​లో ఆలూ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి.. పొటాటో ముక్కలను గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
  • తర్వాత మరొక పాన్​లో కొద్దిగా ఆయిల్​ హీట్​ చేసి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలపండి. ఇప్పుడు జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలపండి. తర్వాత పెరుగు, నిమ్మరసం, కొద్దిగా రెడ్​ కలర్​ వేసుకుని బాగా కలపండి.
  • ఇప్పుడు డీప్​ ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కలను వేసుకుని.. పెరుగు, మసాలా మిశ్రమం ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.
  • చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే.. నోరూరించే ఆలూ 65 రెడీ అయినట్లే. ఈ రెసిపీని వేడివేడిగా తింటే టేస్ట్​ చాలా సూపర్​గా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details