How to Check Beneficiary Status of PM Kisan:దేశంలోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kisan). ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. ఈ స్కీమ్‌ను తొలిసారిగా 2019లో ప్రారంభించగా.. అప్పటి నుంచి ఏటా రూ. 6 వేలను రైతులకు అందిస్తూ వస్తోంది. ప్రతి ఏటా రూ. 6 వేలను మూడు విడతల్లో.. ప్రతి 4 నెలలకూ ఓసారి రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్లోలో నేరుగా వేస్తోంది. ఇప్పటివరకు 16 విడతల డబ్బులు రైతులకు అందాయి. 17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో విడుదల చేయనున్నారు.
ఈ పథకం ద్వారా సుమారు 9.3 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ప్రతి రైతుకూ 2వేల రూపాయల చొప్పున.. మొత్తంగా 20 వేల కోట్ల రూపాయలను ఇవాళ అకౌంట్లలో జమ చేస్తున్నారు. రైతుల సంఖ్య కోట్లలో ఉన్న కారణంగా.. కొందరికి ముందు, మరికొందరికి వెనుక జమ అయ్యే ఛాన్స్ ఉంది. మరి, మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? లేదా? అన్నది ఇలా చెక్ చేసుకోండి.
- ఫస్ట్ మీరు www.pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- తర్వాత వెబ్‌సైట్‌లోని "Beneficiary List" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ స్టేట్, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
- అలాగే లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి.
- మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.
Kisan Rin Portal Details and Benefits in Telugu : అన్నదాతకు శుభవార్త.. అప్పుకోసం వడ్డీ వ్యాపారి వద్దకు అవసరం లేదు!
ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డట్టే. ఆ స్టేటస్ ఇలా తెలుసుకోండి.
- పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
- ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు Get Data అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్‌పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
- ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని అర్థం.
- పీఎం-కిసాన్ నిధి ప్రయోజనం పొందుతున్న రైతులు.. ప్రస్తుతం విడుదలైన 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌తో పాటు ఆ తర్వాతి పేమెంట్లను పొందాలంటే ఈ-కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి.
- రెండు మార్గాల్లో ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
ఓటీపీ విధానంలో ఈ-కేవైసీ..
- పీఎం-కిసాన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. (https://pmkisan.gov.in/)
- Farmers Corner సెక్షన్ కింద ఉండే ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి.
- మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ
- లబ్దిదారులు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రాష్ట్ర సేవా కేంద్రానికి వెళ్లాలి.
- ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ చెప్పాల్సి ఉంటుంది
- సీఎస్‌సీ ఆపరేటర్.. లబ్దిదారుల వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ చేసి బయోమెట్రిక్ అథంటికేషన్‌ను పూర్తి చేస్తారు.
- ఈ విధంగా రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా పీఎం-కిసాన్ నిధి ప్రయోజనాలను పొందవచ్చు.
రైతులకు శుభవార్త! ఈ స్కీమ్‌లో చేరితే నెలకు 3వేల పింఛన్!