తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ! - "మదర్స్​ డే" స్పెషల్ విషెస్ అద్భుతంగా చెప్పండిలా! - Mothers Day 2024 Wishes - MOTHERS DAY 2024 WISHES

Mothers Day 2024 Wishes : మనల్ని కనీ, పెంచీ, ఇంతవాళ్లను చేసిన అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చకోగలం? తల్లి రుణం తీర్చగల బిడ్డలెవరూ ఈ లోకంలో పుట్టలేదు. అందుకే.. కడవరకూ ఆమె ముఖంలో సంతోషం ఉండేలా చూస్తే చాలు. ఆ సంతోషానికి కారణం మనమైతే చాలు. వయసు మీద పడ్డాక బిడ్డలా చూసుకుంటే చాలు. కొంతైనా అమ్మ రుణం తీరుతుంది. ఈ ఆదివారం "మదర్స్​ డే". ఈ సందర్భంగా అమ్మకు అద్భుతమైన శుభాకాంక్షలు చెప్పండి. ఇందుకోసం "ఈటీవీ భారత్" స్పెషల్ విషెస్, కోట్స్ తీసుకొచ్చింది మీకోసం...

Mothers Day 2024 Wishes
Mothers Day 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 9:51 AM IST

Mothers Day 2024 Wishes in Telugu :అమృతం ఉందో లేదో.. అది ఆయుష్షు పోస్తుందో లేదో తెలియదు కానీ.. "అమ్మ" మాత్రం తన ఆయుష్షును సైతం మనకే పోస్తుంది. బిడ్డలుగా మనం నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటుంది. మన బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తుంది. జీవితాంతం.. పిల్లలే లోకంగా జీవిస్తుంది. అలాంటి.. "అమ్మ"ను పూజించుకునేందుకు ఒక రోజును కేటాయించారు. అదే "మాతృ దినోత్సవం(Mothers Day 2024)". ఈ సారి మే 12వ తేదీన వచ్చింది. ఈ సందర్భంగా అందమైన గిఫ్టులతోనే కాదు.. ప్రేమపూర్వకమైన పదాలతో అమ్మకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్పండి. వాట్సాప్, షేర్​చాట్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​లో "మదర్స్ డే" శుభాకాంక్షలు తెలిపేలా "ఈటీవీ భారత్" ప్రత్యేకమైన విషెస్, కోట్స్ తీసుకొచ్చింది.

Mothers Day 2024 Special Wishes :

  • "అమ్మా.. నీ ఒడిలో తలవాల్చితే పొందే ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు.. వచ్చే జన్మలో కూడా నీ బిడ్డగా పుట్టే అదృష్టం నాకిస్తావు కదూ"
  • "నాపై ఈ ప్రపంచంలోని అందరికంటే ఎక్కువ ప్రేమ కురిపిస్తూ.. నన్ను కంటికి రెప్పలా కాపాడుకునే నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం." - మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
  • "అమ్మా.. ఈ జన్మలో నన్ను కనీ, పెంచావు కదా.. వచ్చే జన్మలో ఆ భాగ్యం నాకిస్తావా? బంగారు తల్లిలా నిన్ను చూసుకుంటాను"
  • "ఈ భూమి మీద నేను ఇతరుల్లో స్వచ్ఛమైన ప్రేమను వెతికాను కానీ.. నాకు నీలాంటి స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడా దొరకలేదు అమ్మ." - మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
  • "ఎన్ని తరాలు మారినా.. యుగాలు మారినా.. మారని ప్రేమ, వెలకట్టలేని సంపద.. నీ ప్రేమే అమ్మ."- మదర్స్ డే శుభాకాంక్షలు!
  • "మనం చేసే ఏ పనిలోనైనా మంచిని మాత్రమే వేతికే గొప్ప సహనశీలి, త్యాగమూర్తి మాతృమూర్తి ఒక్కరే"- హ్యాపీ మదర్స్ డే!
  • "బయట అంతా కండీషన్స్​తో కూడిన లవ్​ మాత్రమే ఉంది అమ్మ. ఏ కండీషన్​ లేకుండా.. ఈ భూమ్మీద నన్ను గుండెల్లో దాచుకునే ఏకైక మనిషివి నువ్వే అమ్మ." మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024
  • "ఈ ప్రపంచంలో నువ్వు ద్వేషించినా కూడా.. నీకు ప్రేమను పెంచే వ్యక్తి అమ్మ మాత్రమేనని తెలుసుకో" - మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 2024!
  • "బిడ్డకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కొవ్వొత్తిలా కరిగిపోయే త్యాగశీలి అమ్మ." - అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే 2024!

Mothers Day 2024 Special Quotes :

"అమ్మ లేకపోతే.. జననం లేదు

అమ్మ లేకపోతే.. గమనం లేదు

అమ్మ లేకపోతే సృష్టిలో.. జీవం లేదు

అమ్మ లేకపోతే.. అసలు సృష్టే లేదు

బిడ్డల్ని కంటిపాపలా కాపాడే అమ్మలందరికీ..

- హ్యాపీ మదర్స్ డే!!"

'అమ్మంటే అంతులేని సొమ్మురా..

అది ఏనాటికి తరగని భాగ్యమురా..

తల్లి మనసున అమృతమే చూడరా..

మూతృమూర్తి ఒడిలో స్వర్గమే ఉందిరా..

ఆమె విలువ తెలుసుకుని ప్రేమతో మసులుకోరా..

- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!'

ఆ దేశాల్లో అమ్మలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారట...!

"తల్లిని పూజించు..

భార్యను ప్రేమించు..

సోదరిని దీవించు..

మహిళలను గౌరవించు..

- మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!"

"అర్థం చేసుకొనే నేర్పు..

అంతులేని సహనం..

ఏదైనా సాధించగలిగే మనోబలం..

గుండెలో దాచుకొనే ఔదార్యం..

అదే అమ్మలోని ప్రత్యేకత"

- హ్యాపీ మదర్స్ డే

మదర్స్​ డే స్పెషల్​: అమ్మను మించి దైవమున్నదా?

"జననం నీవే.. గమనం నీవే..

సృష్టివి నీవే.. కర్తవు నీవే..

కర్మవు నీవే.. ఈ జగమంతా నీవే..

అందుకే.. భగవంతుడు అన్ని చోట్లా ఉండలేక ‘అమ్మ’ను సృష్టించాడు.

అమ్మా.. నీకిదే మా వందనం.

- మదర్స్ డే శుభాకాంక్షలు 2024!"

"అమితమైన ప్రేమ.. అమ్మ

అంతులేని అనురాగం.. అమ్మ

అలుపెరుగని ఓర్పు.. అమ్మ

అద్భుతమైన స్నేహం.. అమ్మ

అపురూపమైన కావ్యం.. అమ్మ

అరుదైన రూపం.. అమ్మ

-హ్యాపీ మదర్స్ డే!!

ఏ తల్లైనా.. బిడ్డ నుంచి ఆశించేది కాస్తంత ప్రేమే!

ABOUT THE AUTHOR

...view details