How To Make Garlic Rasam Recipe :భోజనంలో చారు అనగానే చాలా మంది ఎక్కువగా టమాటా చారుకి(Tomato Charu) జనం ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అయితే.. ఈసారి వెరైటీగా "వెల్లుల్లి చారు" ట్రై చేసి చూడండి. దీనికోసం ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదు. టమాటా చారు మాదిరిగానే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఘాటుగా పుల్లగా ఘుమఘుమలాడే వెల్లుల్లి చారును పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి.. ఈ రసం తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వెల్లుల్లి చారు తయారీకి కావాల్సినవి :
- వెల్లుల్లి రెబ్బలు - 20 నుంచి 25
- జీలకర్ర - 1 టీస్పూన్
- మిరియాలు - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 4
- టమాటా ముక్కలు - 1 కప్పు
- చింతపండు - 50 గ్రాములు
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - తగినంత
- వాటర్ - ముప్పావు లీటర్
తాలింపు కోసం :
- నూనె - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 3
- ఇంగువ - కొద్దిగా
- జీలకర్ర - పావుటీస్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- వెల్లుల్లి రెబ్బలు - 5(పొట్టుతో దంచినవి)
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్ జ్వరాలకు సూపర్ రెమిడీ!
తయారీ విధానం :
- ముందుగా వెల్లుల్లి రెబ్బలను పొట్టుతీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మూడు పచ్చిమిర్చిని నిలువుగా, ఒక పెద్ద పండిన టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు రోట్లో జీలకర్ర, మిరియాలు, పొట్టుతీసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, కాడలతో సహా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి.
- ఆపై దంచి వెల్లుల్లి మిశ్రమాన్ని అందులో వేసుకొని.. వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఇక్కడ గర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. వెల్లుల్లిని మరీ ఎక్కువగా వేసుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కువైతే రుచి మారిపోతుంది.
- వెల్లుల్లి వేగాక కట్ చెసుకున్న టమాటా ముక్కలు, పసుపు, రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మరో మూడు నిమిషాలపాటు ఆ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
- ఇప్పుడు 50 గ్రాముల చింతపండు నుంచి తీసిన రసాన్ని ఆ మిశ్రమంలో పోసుకోవాలి. ఆపై దాన్ని 2 నుంచి 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముప్పావు లీటర్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి మెత్తగా మారే వరకు మరిగించుకొని దించేసుకోవాలి.
- సాంబార్లా ఎక్కువ సేపు మరిగించుకోవద్దు. ఎందుకంటే.. అలా మరిగితే చారు రుచి తగ్గిపోతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- చారు ప్రిపేర్ చేసుకొని తర్వాత తాలింపు పెట్టుకోవాలి.
- ఇందుకోసం స్టౌపై మరో పాన్ పెట్టుకొని ముందుగా నూనె వేసుకోవాలి.
- అనంతరం పైన పేర్కొన్న విధంగా తాలింపునకి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి.
- దింపే ముందు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి వేపి తాలింపుని చారులో కలుపుకోండి. అంతే.. ఘాటుగా, పుల్ల పుల్లగా ఉండే ఘుమఘుమలాడే వెల్లుల్లి చారు రెడీ!
కాకరకాయ అనగానే పిల్లలు NO అంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే చేదు మొత్తం ఆవిరైపోతుంది!