Refrigerator Maintenance Tips in Telugu : నేటి రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో రిఫ్రిజిరేటర్ ఒకటి. వాటర్ బాటిళ్ల నుంచి మొదలు.. తినే పదార్థాలు, కూరగాయలు వంటివి నిల్వచేసుకునేందుకు సీజన్‌తో సంబంధం లేకుండా అందరూ ఫ్రిజ్‌ను ఉపయోగిస్తుంటారు. ఇక సమ్మర్లో దీని వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే.. ఇంతలా ఉపయోగించేరిఫ్రిజిరేటర్(Refrigerator)మెయింటెనెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాకాకుండా.. ఈ ఎలక్ట్రానిక్ వస్తువు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారించినా ఫ్రిజ్ బాంబులా పేలి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందంటున్నారు. కాబట్టి, మీ ఇంట్లో ఫ్రిజ్ ఉన్నట్లయితే ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారో లేదో తెలుసుకోండి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- రిఫ్రిజిరేటర్‌లో ముఖ్యంగా పేలుడు దాని కంప్రెషర్ వల్ల సంభవిస్తుంది. ఈ కంప్రెషర్ యూనిట్ వెనుక భాగంలో ఉంటుంది. ఇది పంప్, మోటారును కలిగి ఉండి.. కాయిల్ ద్వారా కూలింగ్ వాయువును సరఫరా చేస్తుంది. ఆ వాయువే ద్రవంగా మారి.. వేడిని గ్రహించి ఐటమ్స్‌ను కూల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
- అయితే.. కొన్నిసార్లు ఫ్రిజ్ వెనుక భాగం చాలా హీట్ అవుతుంది. దాంతో కండెన్సర్ కాయిల్ కుంచించుకుపోవడం మొదలవుతుంది. ఫలితంగా.. కంప్రెసర్ కాయిల్లో ఎక్కువ వాయువు పేరుకుపోయి.. ఒత్తిడి పెరిగి భారీ పేలుడుకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కాబట్టి, ఎప్పటికప్పుడు కంప్రెషర్ కాయిల్ మూసుకోకుండా శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
- ఫ్రిజ్ ఉష్ణోగ్రతను ఎప్పుడు కూడా కనిష్ట స్థాయికి తగ్గించకూడదు. ఎందుకంటే.. దీని కారణంగా కంప్రెసర్‌పై అవసరమైన దానికంటే ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దాంతో అది చాలా వేడిగా మారి పేలిపోయే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
- ఫ్రిజ్‌ను ఆన్‌లో ఉంచి ఎక్కువ రోజుల వరకు దాని డోర్ ఓపెన్ చేయకపోతే అప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. డోర్ ఓపెన్ చేసే ముందు పవర్ సప్లై బంద్ చేయాలి. ఆ తర్వాతే డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల రిఫ్రిజిరేటర్ పేలిపోయే ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.