Floor Cleaning Tips For Monsoon :వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. అందుకే.. ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. బయటి నుంచి ఇంటికొచ్చే వాళ్ల ద్వారా.. బురద, క్రీములు వంటివన్నీ ఇంట్లోకి వచ్చి చేరుతుంటాయి. అందుకే.. ఈ టిప్స్ పాటించి ఫ్లోర్ క్లీనింగ్(Floor Cleaning) చేసుకున్నారంటే.. ఎలాంటి మొండి మరకరలైనా ఇట్టే తొలగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేడినీటితో :వానాకాలంలో అప్పుడప్పుడూ వేడినీటితో ఇంటి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా క్లీన్ చేసుకున్నాక నూలు వస్త్రం లేదా స్పాంజ్‌తో తుడుచుకుంటే సరిపోతుంది. అవసరమైతే దీనికోసం ఫ్లోర్ క్లీనర్లనూ యూజ్ చేయవచ్చంటున్నారు. నార్మల్ లేదా టైల్స్ ఉన్న ఫ్లోర్ విషయంలో ఈ చిట్కాలను ఫాలో కావ్వొచ్చు.
అదే.. మార్బుల్ ఫ్లోర్ ఉంటే.. వాటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా తయారుచేసిన మార్బుల్ ఫ్లోర్ క్లీనర్లు ఉపయోగించడం మంచిదంటున్నారు. వీటివల్ల అవి పాడవకుండా ఉంటాయని చెబుతున్నారు. అలాగే.. వెనిగర్, నిమ్మ, అమ్మోనియా వంటి వాటిని మార్బుల్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి యూజ్ చేయకపోవడమే బెటర్ అంటున్నారు.
వీటితో ఇంటిని నిమిషాల్లో శుభ్రం చేసేయవచ్చు!
తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి :ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. పైగా తరచూ వర్షాలు పడుతూ ఉంటాయి. దీంతో ఫ్లోర్ కాస్త తడిగా మారుతుంటుంది. కాబట్టి.. సోప్‌స్టోన్, గ్రానైట్ తరహా ఫ్లోర్ ఉన్నవారు కాస్త జాగ్రత్త పాటించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. వీటికి తేమను పీల్చుకొనే గుణం ఎక్కువగా ఉంటుందట. అందుకే.. ఏదైనా మరక పడితే అది వెంటనే గట్టిపడిపోతుంది. అప్పుడు వాటిని తొలగించడం కష్టంగా మారుతుంది.
అలాంటి టైమ్‌లో.. వాటిపై మార్బుల్ సీలర్ వేయడం మంచిదని సూచిస్తున్నారు. ద్రవరూపంలో ఉండే దీన్ని మెత్తటి పెయింట్ బ్రష్ లేదా శుభ్రమైన వస్త్రం సాయంతో మరక పడిన ప్రదేశంలో అప్త్లె చేస్తే సరిపోతుందంటున్నారు. లేదంటే.. ఫ్లోర్ పాలిషింగ్ చేయించడం ద్వారా కూడా తేమను పీల్చుకొనే గుణాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
కిచెన్‌లో ఇలా క్లీన్ చేసుకోండి : కిచెన్‌లో వంట చేసేటప్పుడు చిందే నూనె కారణంగా ఆ ప్రాంతం జిడ్డుగా తయారవుతుంది. కాబట్టి దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈజీగా నేలను శుభ్రం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.