Jammu Kashmir Encounter :జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్గాం ప్రాంతంలో ఉగ్రవాద ఉనికికి సంబంధించి సమాచారం అందడం వల్ల భద్రతా బలగాలు, పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. బెహిబాగ్ ప్రాంతంలోని కడ్డర్‌లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ప్రతిదాడికి దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఐదుగురు ఉగ్రవాదులు హతం - JAMMU KASHMIR ENCOUNTER
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఐదుగురు ఉగ్రవాదులు హతం
Jammu Kashmir Encounter (Source : ANI)
Published : Dec 19, 2024, 9:02 AM IST
ఈ మధ్యకాలంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య వరుస కాల్పులు జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ పూంఛ్, రాజౌరీ తదితర జిల్లాల్లోనే క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర ముఠాలు ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ క్రియాశీలకంగా మారాయి. దీంతో ఆ ముఠాలపై భారత భద్రతా బలగాలు దృష్టి సారించాయి.