తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ 3.0' కేబినెట్​లో 33 కొత్త ముఖాలు- ముగ్గురు మాజీ సీఎంలకు తొలిసారి అవకాశం - Firstime Ministers In Modi Cabinet - FIRSTIME MINISTERS IN MODI CABINET

Firstime Ministers In Modi Cabinet : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో ఆదివారం ఏర్పాటైన మంత్రివర్గంలో 33మందికి తొలిసారిగా చోటు దక్కింది. అందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఎడుగురు బీజేపీ మిత్ర పక్షాలకు చెందిన వారు ఉన్నారు. వారెవరంటే?

Firstime Ministers In Modi Cabinet
Firstime Ministers In Modi Cabinet (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 7:16 AM IST

Updated : Jun 10, 2024, 7:21 AM IST

Firstime Ministers In Modi Cabinet :మోదీ.0 కేబినెట్​లో 33మంది కొత్తవారు ఆదివారం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అందులో ఆరుగురికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఇక తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరినవారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక) ఉన్నారు. కొత్తగా కేబినెట్​లో చేరిన వారిలో బీజేపీ మిత్రపక్షాలకు చెందిన ఏడుగురు నేతలు ఉన్నారు. తెలంగాణ నుంచి బండి సంజయ్​ కుమార్​ ఉండగా, ఆంధ్రప్రదేశ్​లో బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్​ పెమ్మసాని తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరారు.

బీజేపీ నుంచి తొలిసారి

  • శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్)
  • మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా)
  • కమలేష్ పాశ్వాన్ (ఉత్తర్​ప్రదేశ్)
  • రవ్‌నీత్ సింగ్ బిట్టు (పంజాబ్)
  • రక్షా ఖడ్సే (మహారాష్ట్ర)
  • సురేష్​ గోపి (కేరళ)
  • సుకాంత మజుందార్ (బంగాల్)
  • దుర్గా దాస్ ఉకే (మధ్యప్రదేశ్)
  • రాజ్ భూషణ్ చౌదరి (బిహార్)
  • సతీష్ దూబే (బిహార్)
  • సంజయ్ సేథ్ (ఝార్ఖండ్)
  • సీఆర్ పాటిల్ (గుజరాత్)
  • భగీరథ్ చౌదరి (రాజస్థాన్)
  • హర్ష్ మల్హోత్రా (దిల్లీ)
  • వి సోమన్న (కర్ణాటక)
  • సావిత్రి ఠాకూర్ (మధ్యప్రదేశ్)
  • ప్రతాప్రావు జాదవ్ (మహారాష్ట్ర)
  • జార్జ్ కురియన్ (కేరళ)
  • కీర్తి వర్ధన్ సింగ్ (ఉత్తర్​ప్రదేశ్​)
  • భూపతి రాజు శ్రీనివాస వర్మ (ఆంధ్రప్రదేశ్)
  • నిముబెన్ బాంబ్నియా (గుజరాత్)
  • మురళీధర్ మోహోల్ (మహారాష్ట్ర)
  • పబిత్రా మార్గరీట (అసోం)
  • బండి సంజయ్ కుమార్ ( తెలంగాణ)

బీజేపీ మిత్ర పక్షాల నుంచి తొలిసారి

  • కె రామ్మోహన్ నాయుడు (టీడీపీ)
  • చంద్రశేఖర్​ పెమ్మసాని (టీడీపీ)
  • లాలన్ సింగ్ (జేడీయూ)
  • రామ్​నాథ్​ ఠాకూర్ (జేడీయూ)
  • జయంత్ చౌదరి(ఆర్​ఎల్​డీ)
  • చిరాగ్​ పాసవాన్ (ఎల్​జేపీ)
  • హెచ్​డీ కుమారస్వామి (జేడీ(ఎస్))

'మోదీ 3.0' కేబినెట్​లో మాజీ ముఖ్యమంత్రులు
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలిలో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండటం విశేషం. ఈ జాబితాలో గతంలో గుజరాత్‌ సీఎంగా పని చేసిన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్యప్రదేశ్‌), రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), సర్బానంద్‌ సోనోవాల్‌ (అసోం), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక), జితిన్‌ రామ్‌ మాంఝీ (బిహార్‌) ఉన్నారు. ఇందులో ఐదుగురు సీఎంలు బీజేపీకి చెందినవారు కాగా, కుమారస్వామి, మాంఝీలు జేడీ(ఎస్‌), హిందుస్థానీ అవామీ మోర్చాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

'మోదీ 3.0' కేబినెట్​లో మహిళలు
ఆదివారం కొలువుదీరిన 'మోదీ 3.0' కేబినెట్​ ఏడుగురు మహిళలకు చోటు దక్కింది. వారిలో ఇద్దరు కేబినెట్‌ హోదా పొందారు. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌తో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకుర్, నిముబెన్‌ బాంభణియా, అప్నాదళ్‌ ఎంపీ అనుప్రియా పటేల్‌ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు. నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి కేబినెట్‌ హోదా పొందగా, మిగిలినవారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. గత ప్రభుత్వంలో 10 మంది మహిళా మంత్రులు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 7కు తగ్గింది.

Last Updated : Jun 10, 2024, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details