తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న 'షీజా'- రాష్ట్రంలో తొలి మహిళగా రికార్డ్!- చకచకా చెట్లు ఎక్కుతూ!! - First Woman Toddy Tapper in Kerala

First Woman Toddy Tapper in Kerala : భర్తకు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల కుటుంబ పోషణ కోసం కల్లు గీత వృత్తిని ఎంచుకుంది కేరళకు చెందిన ఓ మహిళ. చకాచకా కొబ్బరి చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. మరి ఆ మహిళ ఎవరో? ఆమె గాథ ఏంటో తెలుసుకుందాం.

First Woman Toddy Tapper in Kerala
First Woman Toddy Tapper in Kerala (ETV BHARAT)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 10:53 AM IST

Updated : May 7, 2024, 11:22 AM IST

First Woman Toddy Tapper in Kerala : ప్రస్తుత కాలంలో పలు రంగాల్లో మహిళలు రాణించి పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. మగవాళ్లు మాత్రమే చేయగలరనుకున్న పనులను ప్యాషన్​తోనో లేదంటే కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లనో మహిళలు చేస్తున్నారు. కేరళలోని కన్నూర్​కు చెందిన ఓ మహిళ కొబ్బరి కల్లును గీస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చకాచకా చెట్లు ఎక్కుతూ ఔరా అనిపిస్తోంది. ఈ క్రమంలో కేరళలో మొట్టమొదటి కల్లు గీత మహిళా కార్మికురాలిగా నిలిచింది.

భర్తకు రోడ్డు ప్రమాదం జరగడం వల్ల
కన్నూర్​కు చెందిన సీ. షీజా(38)కు జయకుమార్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. జయకుమార్ కార్పెంటర్​గా పనిచేసేవాడు. 2019లో జరిగిన కారు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత జయ కుమార్ కార్పెంటర్ వృత్తి చేయలేకపోవడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. కుటుంబాన్ని పోషించే బాధ్యతను షీజా తనపై వేసుకుంది. కొబ్బరి కల్లు గీసే పనిని నేర్చుకుంది. అప్పటి నుంచి కుటుంబానికి అన్నీతానై భర్తను, పిల్లలను పోషించుకుంటోంది. తన కుటుంబం కోసం కష్టపడుతున్నందకు గర్వంగా ఉందని షీజా చెబుతోంది.

షీజా రోజుకు సుమారుగా 10 కొబ్బరి చెట్లు ఎక్కుతోంది. అంతేగాక వ్యవసాయం కూడా చేస్తోంది. వాతావరణ మార్పులు ఉపాధిపై ప్రభావం చూపుతున్నాయని చెబుతోంది. షీజా వివిధ సామాజిక సంస్థలు, క్లబ్‌ల నుంచి అనేక అవార్డులను అందుకుంది. మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని కుటుంబానికి అండగా నిలవగరని షీజా నిరూపించింది.

మహిళా కాటికాపరి, 40వేలకు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు
పురుషులు మాత్రమే చేసే కాటికాపరి పనిని గత 14 ఏళ్లుగా చేస్తోంది ఓ మహిళ. ఇప్పటివరకు సుమారు 40వేలకు పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేసి తన సహృదయాన్ని చాటుకుంది ఒడిశాకు చెందిన ఓ మహిళా కాటికాపరి. ఆమె ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియాలంటే ఈమె కథ వినాల్సిందే.

అన్నీ తానై 14 ఏళ్లుగా
మయూర్‌భంజ్ జిల్లాలోని బారిపడా పట్టణానికి చెందిన లక్ష్మీ జెనా అనే మహిళ, తన భర్త, ఐదుగురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఈమె భర్త బారిపడా మున్సిపాలిటీలోని ఓ శ్మశానవాటికలో కాటికాపరి పనిలో కుదిరాడు. అయితే కొద్దిరోజులకే లక్ష్మీ భర్త అనారోగ్యం బారిన పడి ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ భారం కావడం వల్ల శ్మశానవాటికలో భర్త నిర్వర్తించే కాటికాపరి పనులను తానే చేయాలని నిర్ణయించుకుంది లక్ష్మీ. అలా 14 ఏళ్ల క్రితం మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయడం ప్రారంభించింది. ఇలా ఇప్పటికే వేల కొద్ది శవాలకు దహన సంస్కారాలు నిర్వహించింది.

బాల్ అనుకుని బాంబును తన్నిన బాలుడు- పేలుడు ధాటికి మృతి - bengal bomb explosion

పోలాండ్ అమ్మాయితో తమిళ అబ్బాయి పెళ్లి- మూడేళ్ల ప్రేమ కథకు శుభంకార్డు- వీడియో వైరల్! - Poland Girl Marry Tamil Boy

Last Updated : May 7, 2024, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details