Firing outside Salman Khan Home :ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ఆయన ఇంటి వద్ద ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్ బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గత ఏడాది మార్చిలో సల్మాన్ ఖాన్‌ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు పలు ఈ మెయిల్స్ వచ్చాయి. అప్పుడు ముంబయి పోలీసులు విచారణ చేపట్టగా, అందులో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ పేర్లు బయటకి వచ్చాయి. దీంతో ఆ ఇద్దరిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఓ విషయం బయటపడింది. ఈ గ్యాంగ్ టార్గెట్ చేసిన వాళ్ల లిస్ట్‌లో సల్మాన్ పేరు ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసులోనూ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.