Easy Tips To Clean Greasy Utensils :మనం రకరకాల కూరలు చేసినప్పుడు గిన్నెలు, కడాయిలు ఎక్కువ జిడ్డు పట్టేస్తుంటాయి. ఆ పాత్రలకు పట్టిన జిడ్డును వదిలించలేక నానా అవస్థలు పడుతుంటారు మహిళలు. కారణం.. జిడ్డు మరకలు ఎంత తోమినా ఓ పట్టాన వదలవు! మరి మీరూ ఇలాంటి ప్రాబ్లమ్‌ను ఫేస్ చేస్తున్నారా? అయితే నో టెన్షన్. ఈ నేచురల్ టిప్స్‌తో ఈజీగా గిన్నెల(Utensils)కు పట్టిన జిడ్డును వదిలించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్లీచింగ్ పౌడర్ : వంట చేసేటప్పుడు పాత్రలు, కుక్కర్లు మాడి అడుగు పట్టేస్తుంటాయి. ఇలాంటి టైమ్‌లో వాటిని క్లీన్ చేయడం అంత సులభమైన పనికాదు! కానీ, అలాంటి వాటినీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం టబ్ నీళ్లల్లో కప్పు బ్లీచింగ్ పౌడర్ కలిపి.. అందులో అడుగంటిన పాత్రల్ని అరగంట సేపు నానబెట్టాలి. ఆపై స్క్రబ్బర్‌తో తోముకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.
నిమ్మరసం :నిమ్మరసం ఆరోగ్యానికే కాదు.. పాత్రల జిడ్డు వదిలించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ముందుగా కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మ చెక్కల పేస్టు తీసుకొని జిడ్డు ఎక్కువ ఉన్న గిన్నెలపై అప్లై చేయాలి. పావుగంట అలాగే ఉంచి ఆపై మెత్తని పీచు లేదా బ్రష్‌తో స్క్రబ్ చేసి కడిగితే సరిపోతుంది. నిమ్మలోని ఆమ్ల గుణాల కారణంగా పాత్రలపై ఉన్న జిడ్డు మరకలు ఈజీగా తొలగిపోతాయంటున్నారు.
2019లో 'జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం పాత్రల జిడ్డును తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్‌లోని ముర్సియా విశ్వవిద్యాలయంలో పోషకాహార విభాగంలో ప్రొఫెసర్ "డాక్టర్ మారియా డి లాస్ డాల్లోస్ కాసి" పాల్గొన్నారు. నిమ్మలోని ఆమ్ల గుణాలు గిన్నెల జిడ్డు వదిలించడంలో చాలా బాగా సహాయపడతాయని వారు పేర్కొన్నారు.
వెనిగర్ :గిన్నెల జిడ్డును తొలగించడంలో వెనిగర్ సహజ క్లెన్సర్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఒక స్ప్రే బాటిల్లో వెనిగర్‌నీ, నీటినీ సమాన పరిమాణాల్లో తీసుకోవాలి. ఆపై వాటిని బాగా కలిపి జిడ్డుపాత్రలపై స్ప్రే చేసుకోవాలి. అలా కాసేపు ఉంచి ఆపై స్క్రబ్బర్‌తో రుద్ది క్లీన్ చేసుకుంటే జిడ్డు మాయమవుతుందంట.