Doctors Remove Needle From Lungs :తమిళనాడు తంజావూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. 14 ఏళ్ల బాలిక ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న నాలుగు సెంటీమీటర్ల సూదిని ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే బయటకు తీశారు. బాలికకు ఎలాంటి గాయం చేయకుండా కేవలం మూడున్నర నిమిషాల్లోనే సూదిని విజయవంతంగా బయటకు తీశారు. ఇందుకోసం డాక్టర్లు బ్రాంకోస్కోపీ అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించారు. బాలిక ఊపిరితిత్తుల నుంచి సూదిని బయటకు తీసే ప్రక్రియను రికార్డ్ చేశారు. బాలిక దుస్తులు మార్చుకుంటుండగా ప్రమాదవశాత్తు నోట్లోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు.
బ్రాంకోస్కోపీ అనేది శ్వాసనాళాలను చూడడానికి ఉపయోగించే ఓ వైద్య విధానం. దీనిని ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధరణ, చికిత్స సమయంలో ఉపయోగిస్తారు. ఓ సన్నని గొట్టానికి కెమెరాను బిగించి శ్వాసనాళంలోకి పంపించి చికిత్స చేస్తారు.
సూదిని చూపిస్తున్న వైద్యుడు (ANI) ఎక్స్‌రేలో కనిపిస్తున్న సూది (ANI) మూడేళ్ల క్రితం తుంటిలో దిగిన సూదిని తీసిన వైద్యులు
మరోవైపు దిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు. మూడేళ్ల క్రితం ఓ మహిళ తుంటిలో దిగిన సూదిని విజయవంతంగా బయటకు తీశారు. సీటీ స్కాన్‌తో పాటు సీ ఆర్మ్ మెషీన్ అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి దీనిని బయటకు తీశారు. డాక్టర్ తరుణ్ మిత్తల్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది.
దిల్లీకి చెందిన రంభాదేవి తుంటిలో మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు ఓ సూది దిగింది. మెషీన్ కుడుతున్న ఆమె, వేరే పని చేయడానికి వెళబోతూ సూదిని పక్కనే ఉన్న మంచంపైన పెట్టింది. ఈ క్రమంలోనే పైకి లేచిన రంభ, ప్రమాదవశాత్తు మంచంపైన పడిపోగా తుంటికి సూది కుచ్చుకుంది. వెంటనే పరిశీలించగా సగం సూది మాత్రమే కనిపించింది. మిగతా సూది గదిలోనే ఎక్కడో పడిపోయిందని అనుకుంది. చాలా సేపు వెతికినా లభించకపోవడం వల్ల వదిలేసింది. తుంటిలో సూది దిగిన విషయాన్ని గమనించని రంభ, ఆ తర్వాత సాధారణంగానే జీవనం సాగించింది. కొన్ని సార్లు తుంటిలో అసౌకర్యం అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే మాడేళ్ల తర్వాత తాజాగా నొప్పి పెరగడం వల్ల ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు ఎక్స్‌రే తీయగా అందులో సగం విరిగిన సూది కనిపించడం వల్ల వైద్యులు షాక్ అయ్యారు. శస్త్రచికిత్స చేసి తొలగించాలని చెప్పారు డాక్టర్లు. కానీ సూది ఉన్న ప్రాంతంలో అనేక ముఖ్యమైన నరాలు ఉంటాయని, ఈ ఆపరేషన్ చేయడానికి అనేక మంది వైద్యులు నిరాకరించారు. చాలా ఆస్పత్రులు తిరిగిన తర్వాత సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు ఈ ఆపరేషన్‌కు ముందుకు వచ్చి విజయవంతంగా పూర్తి చేశారు.
బ్లేడును మింగిన 11నెలల చిన్నారి.. 45 నిమిషాలపాటు శ్రమించి కాపాడిన వైద్యులు..
Safety Pin Stuck Boy Trachea : సేఫ్టీపిన్ను మింగిన 5 నెలల చిన్నారి.. ఐదు రోజుల పాటు నరకం.. చివరికి..