Maharashtra Portfolio Allocation : మహారాష్ట్రలో మంత్రులకు శాఖలను కేటాయించింది కొత్తగా కొలువుదీరిన మహాయుతి ప్రభుత్వం. కీలకమైన హోం శాఖను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నిర్వహించనున్నారు. అంతేకాకుండా సాధారణ పరిపాలన, విద్యుత్, న్యాయ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ శాఖలు కూడా ఫడణవీస్ అధీనంలోనే ఉండనున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందేకు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, ప్రజా పనుల (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్) శాఖల బాధ్యలను అప్పగించారు. మరో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు ఆర్థికశాఖ, ఎక్సైజ్ శాఖలను అప్పగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్ భవంకులే రెవెన్యూశాఖ అప్పజెప్పారు. ఈ మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
మరికొన్ని ముఖ్యమైన పోర్టుఫోలియోలు :
- రాధాకృష్ణ- జలవనరులు (గోదావరి -కృష్ణ లోయ అభివృద్ధి కార్పొరేషన్)
- హసన్ మియాలాల్ - వైద్య విద్య
- చంద్రకాంత్ సరస్వతి - ఉన్నత, సాంకేతిక విద్య, శాసనసభ వ్యవహారాలు
- గిరీశ్ గీతా దత్తాత్రేయ మహాజన్ - జలవనరులు ( విదర్భ, తాపి, కొంకణ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), విపత్తు నిర్వహణ