తెలంగాణ

telangana

ఫుడ్ లేదన్న ఓనర్- కోపంతో ఏకంగా హోటల్​ ధ్వంసం చేసిన ట్రక్కు డ్రైవర్​! - Driver Rams Vehicle Into Hote

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 3:15 PM IST

Truck Driver Rams Vehicle Into Hotel : మహారాష్ట్రలోని పుణెలో మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. భోజనం పెట్టేందుకు నిరాకరించారన్న కోపంతో తన ట్రక్కుతో హోటల్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించాడు.

Truck Driver Rams Vehicle Into Hotel
Truck Driver Rams Vehicle Into Hotel (ETV Bharat)

Truck Driver Rams Vehicle Into Hotel :భోజనం పెట్టేందుకు నిరాకరించారన్న కోపంతో మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. షోలాపూర్‌ నుంచి పుణెకు వెళుతున్న ఓ ట్రక్కు డ్రైవర్‌ మార్గమధ్యలో ఉన్న హోటల్‌ గోకుల్‌ వద్ద వాహనాన్ని ఆపాడు. లోపలికి వెళ్లి భోజనాన్ని ఆర్డర్‌ చేశాడు.

అయితే భోజనం ఇవ్వడం కుదరదని హోటల్‌ సిబ్బంది అతడికి చెప్పారు. కోపం వచ్చిన ఆ డ్రైవర్‌ వెంటనే ట్రక్కుతో హోటల్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. హోటల్‌ ముందు పార్క్‌ చేసిన కారును ఢీకొట్టి తుక్కుతుక్కు చేశాడు. హోటల్‌ గోడలను బలంగా ఢీకొట్టాడు. అక్కడున్న కొందరు, డ్రైవర్‌ను ఆపేందుకు రాళ్లు విసిరారు. చివరకు ట్రక్కు ముందుభాగం దెబ్బతినడం వల్ల అది కదల్లేకపోయింది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details