దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ - నేడు ప్రకటించనున్న ఈసీ - DELHI ASSEMBLY ELECTIONS SCHEDULE
దిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ 2025 - నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
Published : Jan 7, 2025, 9:14 AM IST
Delhi Assembly Elections Schedule :దిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ (మంగళవారం) కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ వివరాలను ఈసీ వెల్లడించనుంది. 70 మంది ఎమ్మెల్యేలతో కూడిన దిల్లీ అసెంబ్లీ కాలపరిమితి ఫిబ్రవరి 23వ తేదీతో ముగియనుంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగానూ అంతకంటే ముందే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయడం అనేది దిల్లీలో సంప్రదాయంగా వస్తోంది. ఈసారి ఈసీ ఏ విధమైన షెడ్యూల్‌ను ప్రకటిస్తుందో వేచిచూడాలి.