PM Kisan Scam : పీఎం కిసాన్ పథకం ద్వారా సుమారు 9.3 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. వీరందరికీ 17వ విడత చెల్లింపులు చేసేందుకు.. కేంద్రం దాదాపు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. చాలా మంది బ్యాంకు అకౌంట్లలో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కానీ.. కొందరికి ఇంకా జమ కాలేదు. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు! "మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి" అంటూ మోసపు లింకులు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నవారు దానిపై క్లిక్ చేస్తూ సర్వం పోగొట్టుకుంటున్నారు.
కుమురంభీం జిల్లాలో..
తాజాగా కుమురంభీం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లాలోని దహెగాం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తనకు వచ్చిన ఇలాంటి లింక్‌పై క్లిక్ చేశాడు. అంతే.. వెంటనే తన అకౌంట్లోని రూ.98 వేలు మాయమైపోయాయి. అంతే కాదు.. అతని ఫోన్ నంబర్, ఆధార్ కార్డు కూడా పని చేయకుండా పోయాయి. కాబట్టి.. ఇలాంటి అపరిచిత వ్యక్తులు పంపించే లింకులుపై క్లిక్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ.. ఎక్కడో ఒకచోట మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
పీఎం కిసాన్ డబ్బులు రాలేదంటే..
ఎవరికైనా పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ కాలేదంటే.. వారు కేవైసీ పూర్తిచేయకపోవడమే కారణం కావొచ్చు. దీన్ని నిర్ధారించుకోవడానికి ఈ పద్ధతి అనుసరించండి. ముందుగా..
www.pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
తర్వాత వెబ్‌సైట్‌లోని "Beneficiary List" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ స్టేట్, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
అలాగే లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి.
మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.
ఈ జాబితాలో పేరు ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడ్డట్టే. ఆ స్టేటస్ ఇలా తెలుసుకోండి.
స్టేటస్ చెకింగ్ ఇలా..
పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్‌ను ఓపెన్ చేయండి.
ఇప్పుడు "Know Your Status" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.