Clothes Washing Tips: వాషింగ్ మెషీన్లో వేసినా, చేతులతో దుస్తులు ఉతికినా సరే ఒక్కక్కరికీ ఒక్కో పద్ధతి ఉంటుంది. కొంత మంది దుస్తులను తిరగేసి ఉతికితే ఇందకొందరు నేరుగా అంటే బయట భాగంవైపే ఉతుకుతారు. అయితే ఈ రెండింటిలో ఏది సరైన మార్గం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ దుస్తులు తిరగేసి ఉంటే ఏంటి మామూలుగా ఉంటే ఏంటి? ఎలాగోలా ఉతికేసుకుంటున్నాం కదా అని లైట్ తీసుకోకండి. దుస్తులు ఎక్కువకాలం పాడవకుండా ఉండాలంటే ఇవన్నీ చూసుకుని ఉతకడం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు.
మనం వేరు వేరు రకాల మురికి, చెమట ఉన్న వస్త్రాలను కలిపి ఉతుకుతాం. మిషన్లో వేసినా చేతులతో ఉతికినా ఇదే పద్ధతిని పాటిస్తాం. అయితే నిపుణులు మాత్రం దుస్తులను లోపలి భాగం నుంచి అంటే తిరగేసి ఉతకడం మంచిదని అంటున్నారు. వాషింగ్ మెషీన్ ఉపయోగించేటప్పుడు కొంచెం ఎక్కువ సయమం తీసుకున్నప్పటకీ ఈ పద్ధతిలో ఉతకాలని చెబుతున్నారు. అప్పుడే ఎక్కువ కాలం ఉంటాయని తెలుపుతున్నారు.
ప్రయోజనాలు
రంగు : వస్త్రాల లోపలి భాగాన్ని అంటే తిరగేసి ఉతకడం వల్ల బయట భాగంపై రాపిడి తగ్గి, వస్త్రం రంగు పోకుండా కాపాడవచ్చు. జిప్పులు, బటన్స్ ఊడకుండా రక్షించవచ్చు. అలాగే దుస్తుల రంగు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
మరక :దుస్తులను తిరగేసి ఉతకడం వల్ల లోపలి భాగంలోని మొండి మరకలు, మురికి వంటి వాటిని సులభంగా తొలగించవచ్చు. ముఖ్యంగా అథ్లెట్స్ దుస్తులు, యూనిఫార్మ్స్ విషయంలో ఈ పద్ధతి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.