Chhattisgarh Accident Today : ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఘోర రహదారి ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో ఓ బస్సు బోల్తాపడి ముగ్గురు మహిళలతో సహా మొత్తం 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యయి. వారంతా ఓ డిస్టిల్లరీ సంస్థ ఉద్యోగులుగా గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- బస్సు బోల్తా పడి 12 మంది మృతి - Chhattisgarh Accident Today - CHHATTISGARH ACCIDENT TODAY
Chhattisgarh Accident Today : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు.
Published : Apr 9, 2024, 10:56 PM IST
|Updated : Apr 10, 2024, 6:27 AM IST
దుర్గ్ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా పోస్టుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సాధ్యమైన మేర సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించనున్నట్లు చెప్పారు.