Expensive Gifts For Employees :సంస్థ కోసం పాటు పడుతున్న ఉద్యోగుల కోసం పండగలు, ప్రత్యేక సందర్భాల్లో కానుకలు ఇస్తుంటాయి కంపెనీలు. అలాగే వార్షిక బోనస్, పండగ బోనస్ అంటూ ఇస్తారు. అయితే చెన్నైకి చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇచ్చింది. తమ ఉద్యోగులకు కార్లు, బైక్స్, స్కూటీలను ఇచ్చింది.
ప్రతిభావంతులైన 20మందికి
చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సర్‌మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను ఇచ్చింది. ప్రతిభావంతులైన 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను బహుమతులుగా అందజేసింది. పనిలో ఉద్యోగుల్ని మరింతగా ప్రోత్సహించడమే కాకుండా అత్యున్నత లక్ష్యాల్ని సాధించేందుకు వారిని ప్రేరేపించేలా ఈ గిప్ట్స్ ఇచ్చింది. లాజిస్టిక్స్ రంగంలో సరకుల రవాణా, పారదర్శకత, సరఫరా గొలుసులో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది.
అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్‌ను సరళీకృతం చేయడమే తమ కంపెనీ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంప్రదాయ షిప్పింగ్, లాజిస్టిక్స్ ప్రక్రియలో సవాళ్లకు సమర్థమంతమైన పరిష్కాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వల్ల వారిలో సంతృప్తిని పెంచడమే కాకుండా ఉత్పాదకత పెరుగుతుందన్నారు. ప్రేరణ పొందిన ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబరుస్తారని తెలిపారు.
ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్స్‌గా మారుతి, టాటా కార్లు- ఫ్యూయల్ ఛార్జ్ కూడా!
ఇటీవల హరియాణాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ దీపావళి కానుకగా తమ ఉద్యోగులకు లగ్జరీ కార్లను పంపిణీ చేసింది. టాటా పంచ్, మారుతి గ్రాండ్ విటారా కార్లను 'స్టార్ పెర్‌ఫార్మర్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన 15 మంది కంపెనీ ఉద్యోగులకు ఈ గిఫ్ట్‌ను అందించారు. గతేడాది కూడా కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు ఇలానే బహుమతులను అందించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి