తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దువ్వూరి నాగేశ్వర్​రెడ్డికి పద్మవిభూషణ్​- నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్​ - PADMA AWARDS 2025

2025 పద్మ పురస్కార గ్రహీతల జాబితాను ప్రకటించిన కేంద్రం

Padma Awards 2025
Padma Awards 2025 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 7:39 PM IST

Updated : Jan 25, 2025, 10:31 PM IST

Padma Awards 2025 :గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ఏడుగురికి పద్మవిభూషణ్​, 19 మందికి పద్మభూషణ్​, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పద్మ పురస్కారానికి ఎంపికైన వారికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

పద్మవిభూషణ్​

  1. దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి (వైద్యం) - తెలంగాణా
  2. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ - చండీగఢ్
  3. కుముదిని రజనీకాంత్‌ (కళలు) - గుజరాత్​
  4. లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం (కళలు) - కర్ణాటక
  5. ఎం.టి.వాసుదేవన్‌ నాయర్‌ (సాహిత్యం) - కేరళ (మరణానంతరం)
  6. ఒసాము సుజుకి (వాణిజ్యం)- జపాన్​
  7. శారద నిన్హా (కళలు) - బిహార్​

పద్మభూషణ్​

  • నందమూరి బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్​
  • అనంతనాగ్‌ (కళలు) - కర్ణాటక
  • అజిత్ కుమార్​ (కళలు) - తమిళనాడు
  • శోభన (కళలు) - తమిళనాడు
  • శేఖర్ కపూర్​ (కళలు) - మహారాష్ట్ర

నోట్​ : పై వారందరూ సినీ రంగానికి చెందినవారు కావడం గమనార్హం.

  • శ్రీజేష్​ (హాకీ) - కేరళ
  • బిబేక్‌ దేబ్రాయ్‌ (సాహిత్యం) - దిల్లీ
  • మనోహర్‌ జోషి (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర
  • సుశీల్‌కుమార్‌ మోదీ (ప్రజావ్యవహారాలు) - బిహార్​

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు వీరే!

  • మందకృష్ణ మాదిగ - తెలంగాణ
  • జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు) - బ్రెజిల్‌
  • హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) - హరియాణా
  • భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) - బిహార్‌
  • పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) - పుదుచ్చేరి
  • ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు) - నాగాలాండ్‌
  • బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్‌
  • షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా) - కువైట్‌
  • నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) - నేపాల్‌
  • హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) - హిమాచల్​ప్రదేశ్‌
  • జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త) - అరుణాచల్​ప్రదేశ్‌
  • విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర
  • వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) - కర్ణాటక
  • నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్‌
  • జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు) - అసోం
  • సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు) - గుజరాత్‌
  • రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త) - ఉత్తరాఖండ్‌
  • పాండి రామ్‌ మాండవి (కళాకారుడు) - ఛత్తీస్‌గఢ్‌
  • లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు) - గోవా
  • గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు) - బంగాల్
  • సాల్లీ హోల్కర్‌ (చేనేత) - మధ్యప్రదేశ్‌
  • మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య) - మహారాష్ట్ర
  • బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) - రాజస్థాన్‌
  • వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) - తమిళనాడు
  • భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) - కర్ణాటక
  • పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత) - గుజరాత్
  • విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం) - కర్ణాటక
  • చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ) - మహారాష్ట్ర
  • జగదీశ్‌ జోషిలా (సాహిత్యం) - మధ్యప్రదేశ్‌
  • నీర్జా భట్లా (గైనకాలజీ) - దిల్లీ
  • హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌) - ఉత్తరాఖండ్‌

తెలుగు 'పద్మా'లు
ఈ ఏడాది ఏకంగా ఏడుగురు తెలుగు వ్యక్తులకు పద్మ పురస్కారాలు వరించాయి.

  1. ప్రఖ్యాత వైద్యుడు డి.నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌ (వైద్యం)
  2. నందమూరి బాలకృష్ణకు(ఏపీ) పద్మభూషణ్ (కళలు)
  3. తెలంగాణకు చెందిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ (ప్రజావ్యవహారాలు)
  4. ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకు పద్మశ్రీ(కళలు)
  5. ఏపీకి చెందిన కె.ఎల్‌.కృష్ణకు పద్మశ్రీ(సాహిత్యం)
  6. ఏపీకి చెందిన మాడుగుల నాగఫణిశర్మకు పద్మశ్రీ(కళలు)
  7. ఏపీకి చెందిన పంచముఖి రాఘవాచార్యకు పద్మశ్రీ(సాహిత్యం)
Last Updated : Jan 25, 2025, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details