Boy Fell Into Borewell Rescued :బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడ్ని సురక్షితంగా బయటకు తీశారు. 20గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడ్ని రక్షించాయి. బయటకు తీసిన వెంటనే బాలుడ్ని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కర్ణాటక విజయపుర జిల్లా లచయానా గ్రామానికి చెందిన సతీశ్ ముజగొండ అనే రైతు తన పొలంలో బోరుబావి తవ్వించాడు. బుధవారం సాయంత్రం అతడి కుమారుడు సాత్విక్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సాయంత్రం 6 గంటల సమయంలో సహాయక చర్యలు ప్రారంభించారు. 20 అడుగుల లోతులో చిక్కుకుపోయిన బాలుడికి ఆక్సిజన్ సరఫరా చేశారు. ఘటన స్థలంలో మెడికల్ బృందం, అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. మరోవైపు, సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని గ్రామంలోని సిద్దలింగ మహారాజు సన్నిధిలో స్థానికులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.
బయటకు తీసినా దక్కని ప్రాణం
ఇటీవల గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక జిల్లాలో 30 అడుగుల బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాయక బృందాలు అనేక గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారిని బయటకు తీసినా లాభం లేకుండా పోయింది. చిన్నారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగాయి. ఎల్ ఆకారంలోని హుక్తో బాలికను తాడుతో కట్టి 15 అడుగుల మేర పైకి తీసుకొచ్చారు. బోరుబావికి సమాతరంగా తవ్వకాలు కూడా జరిపారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే చికిత్స కోసం అంబులెన్స్‌లో జామ్ ఖంభాలియా పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.