తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సండే స్పెషల్ - బ్లాక్​ మటన్​ రెసిపీ - తిన్నారంటే మైమరచిపోతారు!

Black Mutton Curry: మీకు మటన్​ అంటే ఇష్టమా? అయితే మీ కోసమే ఇది. మీరు సరికొత్తగా ఫీలయ్యే రెసిపీ తీసుకొచ్చాం. అదే.. బ్లాక్​ మటన్​ కర్రీ! దీన్ని తిన్నారంటే "ఆహా" అనాల్సిందే! మరి.. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Black Mutton Curry
Black Mutton Curry

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 4:44 PM IST

Black Mutton Curry Making Process:ఎప్పుడూ రొటీన్ కాకుండా.. వెరైటీ రెసిపీస్ ఇష్టపడేవాళ్లు తప్పకుండా.. ఈ బ్లాక్ మటన్ కర్రీని ప్రయత్నించి చూడాల్సిందే. ముఖ్యంగా రోటీల్లో ఈ కర్రీ సూపర్​ కాంబినేషన్​. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

బ్లాక్​ మటన్​ కర్రీకి కావాల్సిన పదార్థాలు:

  • మటన్​- 750 గ్రాములు(ముప్పావు కిలో)
  • పసుపు - అర టీస్పూన్​
  • ఉల్లిగడ్డ - 4(మీడియం సైజ్​)
  • ధనియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • యాలకులు - 4
  • లవంగాలు - 4
  • సోంపు గింజలు - 1 టేబుల్​స్పూన్​
  • ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
  • షాజీరా - 1 టీస్పూన్​
  • తురిమిన అల్లం- 1 టేబుల్​ స్పూన్​
  • చింతపండు గుజ్జు - 1 టేబుల్​స్పూన్​
  • పుదీనా - కొద్దిగా
  • గ్రీన్​ చట్నీ - అర కప్పు
  • పెరుగు - 1 కప్పు
  • నూనె - 4 టేబుల్​ స్పూన్​
  • గసగసాలు - 1 టేబుల్​ స్పూన్​
  • దాల్చిన చెక్క - 1 టేబుల్​ స్పూన్​
  • మిరియాలు - 4
  • ఎండుమిర్చి - 3
  • బిర్యానీ ఆకు - 1
  • తురిమిన వెల్లుల్లి - ఒకటిన్నర టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - తగినంత
  • కసూరీ మేతి - 1 టేబుల్​ స్పూన్​

బ్లాక్​ మటన్​ కర్రీ తయారీ విధానం:

  • ముందుగా మటన్​ను​ గోరువెచ్చని నీళ్లతో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మళ్లీ నార్మల్ వాటర్​తో శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని అందులోకి పసుపు, పెరుగు, గ్రీన్​ చట్నీ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అందులోకి మటన్​ ముక్కలు వేసి ఆ మిశ్రమం మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోని 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడ స్టవ్​ మీద కుక్కర్​ పెట్టుకుని కొద్దిగా ఆయిల్​ పోసుకోవాలి. ఆయిల్​ వేడెక్కాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు వేగిన తర్వాత మారినేట్​ చేసిన మటన్​ ముక్కలను వేసుకుని కలుపుకోవాలి.
  • అందులోకి ఒక కప్పు వాటర్​ పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్​ను హై ఫ్లేమ్​లో పెట్టి ఓ విజిల్​ వచ్చిన తర్వాత మంట తగ్గించి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇప్పడు మరో స్టవ్​ మీద ఓ పాన్​ పెట్టి 1 టేబుల్​స్పూన్​ ఆయిల్​ వేసి బిర్యానీ ఆకు, షాజీరా మినహా మిగిలిన మసాలాలు(ధనియాలు, యాలకులు, లవంగాలు, సోంపు, గసగసాలు, దాల్చినచెక్క, మిరియాలు, ఎండు మిర్చి) వేసి వేయించుకోవాలి.
  • తర్వాత అందులోకి మరికొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోవాలి.
  • ఇప్పుడు కొబ్బరి తురుము వేసి వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు మళ్లీ స్టవ్​ మీద ఓ పాన్​ పెట్టి షాజీరా, బిర్యాని ఆకు వేసి వేయించాలి.
  • తర్వాత తురిమిన అల్లం, వెల్లుల్లి వేసి.. అవి వేగిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో మటన్​ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్​ వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి. చింతపండు గుజ్జు, కసూరి మేతి కూడా వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు స్టవ్​ను సిమ్​లో పెట్టి ముక్క మెత్తగా ఉడికే వరకు(25 నుంచి 30 నిమిషాలు) ఉంచి స్టవ్​ ఆఫ్​ చేస్తే బ్లాక్ మటన్ కర్రీ రెడీ అవుతుంది.
  • పైన పుదీనా ఆకులు చల్లుకుంటే సువాసన మాత్రమే కాదు రుచి అదిరిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details