Best Vegan Dishes to Celebrate Ramadan :ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు(రోజా) చేపట్టిన ముస్లిం సోదరులు.. నేటి ఈద్-ఉల్-ఫితర్(రంజాన్)తో ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలో రంజాన్ విందును ముస్లిం సోదరులు ఎక్కువగా మాంసాహారం వంటలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. పర్యావరణం, ఆరోగ్యం వంటి కారణాల వల్ల చాలా మంది శాకాహారానికి మారుతున్నారు. ఇలాంటి వారు.. ఈద్ విందులో మాంసాహారానికి ఏ మాత్రం తగ్గని వీగన్ ఫుడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వీగన్ షీర్ ఖుర్మా :రంజాన్ రోజూ ప్రతీ ముస్లిం తప్పనిసరిగా టేస్ట్ చేసే రెసిపీ షీర్ ఖుర్మా. ఈ వంటకానికి అద్భుతమైన రుచిని అందించడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే.. వీగన్ డైట్ పాటించేవారు పాలు, నెయ్యి వంటి వాటికి దూరంగా ఉంటారు. కాబట్టి, మీరు పాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో దొరికే కొన్ని రకాల హోస్ట్‌తో(ఓట్, బాదం, సోయా పాలు) ఈ ప్రత్యేకమైన డెజర్ట్‌ను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే.. బాదం, జీడిపప్పు, ఓట్స్‌ను యాడ్ చేసుకుంటే అద్భుతమైన పోషకాలు లభించడమే కాకుండా వీగన్ షీర్ ఖుర్మా అదిరిపోయే టేస్ట్‌ను అందిస్తుంది!
బాబా గణౌష్(Baba Ganoush) : ఈద్ సాంప్రదాయ విందులో వీగన్స్ కోసం మరో అద్భుతమైన వంటకం.. బాబా గణౌష్. మధ్యప్రాచ్యానికి చెందిన ఈ శాకాహార ప్రసిద్ధ వంటకంలో పోషకాలు మెండుగా ఉండి రుచికరంగా ఉంటుంది. ఈ వీగన్ స్పెషల్ రెసిపీని వంకాయలు, వెల్లుల్లి, ఆలివ్ నూనె, నిమ్మరసం, బీన్స్‌తో ప్రిపేర్ చేసుకుంటారు.
టబ్బులేహ్(Tabbouleh) :ఈ రుచికరమైన సలాడ్.. రంజాన్ రోజు శాకాహారం తినే ముస్లింలకు గొప్ప ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు. దీన్ని బుల్గుర్ గోధుమలు, సన్నగా తరిగిన పార్స్లీ, టమాటాలు, ఉల్లిపాయలు, నిమ్మరసం, పుదీనా, మసాలాలతో ప్రిపేర్ చేసుకుంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌తో నిండి ఉంటాయి.