తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హ్యాండ్ బ్యాగ్ ఎలా సెలక్ట్​ చేసుకోవాలో తెలుసా? - ఈ టిప్స్ పాటిస్తే మీరే సెంటరాఫ్ అట్రాక్షన్!

Perfect Handbag Purchase Tips : ఈరోజుల్లో మహిళలు ఎక్కడికెళ్లినా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇవి వారికి ఎంతో సహాయపడడంతో పాటు స్టేటస్​ను పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అసలు సమస్య ఏమంటే.. పర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్ ఎంచుకోవడమే. బ్యాగ్ కొనుగోలు చేయడంలో మీకు క్లారిటీ లేకపోతే.. కొన్ని టిప్స్​ సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Handbag
Perfect Handbag

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 4:33 PM IST

Best Tips to Purchase A Perfect Handbag :ఆడవాళ్ల అలంకరణలో హ్యాండ్ బ్యాగ్ కూడా కీలకమైనదే. అయితే.. పర్ఫెక్ట్ బ్యాగ్ సెలక్ట్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ.. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సైజ్ :మీరు పర్ఫెక్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు చూడాల్సిన మొదటి అంశం.. బ్యాగ్ సైజ్. ముఖ్యంగా దాని పరిమాణం మీ బాడీకి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. చాలా మంది ఎక్కువ వస్తువులు పట్టాలని పెద్ద సైజ్​లో ఉండే బ్యాగ్స్​ ఎంచుకుంటుంటారు. కానీ, అలాకాకుండా మీరు తరచూ వాడే కొన్ని వస్తువులు పట్టేంత చిన్న సైజులో ఉన్న బ్యాగ్​ సెలక్ట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాగ్ బరువు కూడా ఎక్కువ ఉండకుండా చూసుకోవడం మంచిదట.

నాణ్యత : చాలా మంది చేసే పొద్దపొరపాటు ఏంటంటే తక్కువ ధరకు హ్యాండ్ బ్యాగ్ వస్తుందని తీసుకుంటారు. కానీ, అది కొన్నిరోజులకే పాడవుతుంది. కాబట్టి మీరు హ్యాండ్ బ్యాగ్ తీసుకునేటప్పుడు కొంచెం ధర ఎక్కువైనా మంచి మెటీరియల్​తో తయారనైవే కొనడం మంచిది. ఎందుకంటే.. ఇవి ఎక్కువ కాలం రావడంతో పాటు మంచి లుక్​ని ఇస్తాయి. నిత్య వాడకానికి అయితే లెదర్ బ్యాగ్​లు మంచివంటున్నారు నిపుణులు.

"గర్ల్ ఫ్రెండ్ బ్యాగులో.. గబ్బు పని" రూ.15 లక్షలు ఫైన్ వేసిన జడ్జి..!

రంగు : కొందరు డబ్బు ఎక్కువ ఖర్చు చేసి కొన్నా సరైన కలర్ బ్యాగ్ ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతుంటారు. నిజానికి.. హ్యాండ్ బ్యాగ్ కలర్ సెలక్షన్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎక్కువ బ్యాగ్​లు కొనే పరిస్థితి లేకపోతే.. నలుపు, గోధుమ, తెలుపు రంగుల్లో ఉన్నవి తీసుకోవడం మంచిది. ఇవి చాలా వరకు మీరు తరచుగా ధరించే దుస్తులతో మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే.. మీరు ఆఫీస్​ కోసం బ్యాగ్ కావాలనుకుంటే రెడ్, బ్లూ కలర్స్​తోపాటు డస్టీ పింక్​, గ్రే వంటి పాస్టెల్‌ కలర్ బ్యాగ్​లు సెలక్ట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

కంపార్ట్​మెంట్స్ : మీరు హ్యాండ్ బ్యాగ్ కొనేటప్పుడు చూడాల్సిన మరో పాయింట్ ఏంటంటే.. మల్టీ కంపార్ట్​మెంట్స్. నిజానికి తక్కువ కంపార్ట్​మెంట్స్​తో కూడిన బ్యాగ్​లు అనుకూలమైనవి అయినప్పటికీ.. ఆడవాళ్లకు వస్తువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. కొన్ని ఎక్కువ కంపార్ట్ మెంట్స్ ఉండే బ్యాగు తీసుకుంటే బాగుంటుంది. సెల్‌ ఫోన్, మేకప్ కిట్, పెన్, కర్చీఫ్, కీస్, బస్‌ పాస్ వంటి మొదలైనవన్నీ పెట్టుకునేలా కంపార్ట్​మెంట్స్​ ఎక్కువగా ఉన్నవి తీసుకోవాలి.

ఇవేకాకుండా.. మీరు హ్యాండ్ బ్యాగ్ కొనుగోలు చేసేటప్పుడు బ్యాగ్ హ్యాండిల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో లోపల బ్యాగ్ లైనింగ్ క్లాత్ క్వాలిటీగా ఉందో లేదో చూడాలి. ఇంకా.. జిప్స్, కుట్లు గట్టిగా ఉన్నాయో లేదో షాపులో ఉండగానే చెక్ చేసుకోవాలి. ఫైనల్​గా డిజైన్​ విషయానికి వస్తే ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి.. మీకు నచ్చింది సెలక్ట్​ చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు.

నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్​ పాటిస్తే మెరిసిపోతారంతే!

ABOUT THE AUTHOR

...view details