Baby Corn Manchurian Making Process:చాలా మందికి ఫాస్ట్‌ఫుడ్ ఐటెమ్ మంచూరియా అంటే చాలా ఇష్టం. వెజ్, చికెన్, పనీర్ మంచూరియా అంటూ రకరకాలుగా తింటుంటారు. అయితే వీటితో పాటు ఒక్కసారి బేబీ కార్న్ మంచూరియా రెసిపీ ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈవెనింగ్ స్నాక్స్ కూడా బెస్ట్ ఆప్షన్. పైగా బేబీ కార్న్ సాధారణ ధరకే మార్కెట్లో లభిస్తుంది.ఇక, దీన్ని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..
బేబీ కార్న్ మంచూరియాకు కావాల్సిన పదార్థాలు:
- బేబీ కార్న్ - పది
- కార్న్ ఫ్లోర్(మొక్క జొన్న పిండి) - మూడు స్పూన్లు
- ఉల్లిపాయ - ఒకటి
- పచ్చిమిర్చి - 2
- అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
- కారం - ఒక స్పూను
- ఉప్పు - రుచికి సరిపడా
- మైదాపిండి - రెండు స్పూన్లు
- సోయాసాస్ - రెండు స్పూన్లు
- చిల్లీ సాస్ - ఒక స్పూను
- టమాట సాస్ - రెండు స్పూన్లు
- నూనె - వేయించడానికి సరిపడా
- వెల్లుల్లి తరుగు - అర స్పూను
- ఉల్లికాడల తరుగు - ఒక స్పూను
నోరూరించే పుల్లపుల్లని మామిడికాయ పకోడీలు - ఇలా చేస్తే చిటికెలో ప్లేట్లు ఖాళీ! - Mango Pakoda Recipe
బేబీ కార్న్ మంచూరియా తయారీ విధానం:
- ఒక గిన్నెలో బేబీ కార్న్‌లను వేసి ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలు చేసుకోవాలి.
- అందులోనే కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. కాస్త నీటిని కూడా వేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి.
- నూనె వేడెక్కాక ఈ బేబీ కార్న్ వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూన్ నూనె వేయాలి.
- అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
- అలాగే వెల్లుల్లి తరుగును వేసి వేయించాలి. అందులోనే చిల్లి సాస్, సోయాసాస్, టమాట సాస్ కూడా వేసి చిన్న మంట మీద వేయించాలి.
- రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇవన్నీ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి.
- తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ వేసి టాస్ చేసుకోవాలి. రెండు నిమిషాలు అవి ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి.
- పైన ఉల్లికాడల తరుగును వేసుకోవాలి. అంతే బేబీ మంచూరియా రెసిపీ రెడీ!
సమ్మర్లో ఈ మిల్క్‌షేక్‌లు తాగితే - ఎండ వేడిమి నుంచి బిగ్ రిలీఫ్! - ప్రిపరేషన్ వెరీ ఈజీ! - Summer Milkshake Recipes
'ఆలూ మాసాలా సాండ్విచ్' - ఇలా చేసి పెడితే - పిల్లలు 'మమ్మీ ఇట్స్ టూ యమ్మీ' అనడం పక్కా! - Aloo Masala Sandwich Recipe