తెలంగాణ

telangana

'ఎన్నో బలిదానాల తర్వాత మన రాములోరొచ్చేశారు'- ప్రధాని మోదీ

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 7:28 AM IST

Updated : Jan 22, 2024, 2:54 PM IST

Ayodhya Ram Mandir Live Update
Ayodhya Ram Mandir Live Update

14:54 January 22

  • ఇవాళ దేశంలో నిరాశావాదానికి చోటు లేదు: ప్రధాని మోదీ
  • ఉన్న బలాన్ని కూడదీసుకుని దేశ వికాసానికి తోడ్పడాలి: మోదీ
  • దేవ్‌ సే దేశ్‌.. రామ్‌ సే రాష్ట్ర్‌.. ఇదే మన కొత్త నినాదం..: మోదీ
  • పరాక్రమవంతుడు రాముడిని నిత్యం పూజించాలి: ప్రధాని మోదీ
  • రాముడు.. వేల ఏళ్లుగా మనకు ప్రేరణ కలిగిస్తున్నాడు: ప్రధాని మోదీ
  • భవిష్యత్తులో మనం అనేక విజయాలు సాధించాలి: ప్రధాని మోదీ
  • భారత సర్వోన్నత అభివృద్ధికి ఈ మందిరం చిహ్నం కావాలి: ప్రధాని మోదీ
  • రాముడు అగ్ని కాదు.. రాముడు వెలుగు: ప్రధాని మోదీ
  • రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం: ప్రధాని మోదీ
  • ఇది విగ్రహ ప్రాణప్రతిష్ఠే కాదు.. భారత విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ: ప్రధాని
  • ఇది కేవలం ఆలయమే కాదు.. భారత చైతన్యానికి ప్రతీక..: ప్రధాని మోదీ
  • రాముడే భారత్ ఆధారం.. రాముడే భారత్‌ విధానం: ప్రధాని మోదీ
  • రాముడే విశ్వం.. రాముడే విశ్వాత్మ: ప్రధాని మోదీ
  • రాముడే నిత్యం.. రాముడే నిరంతరం: ప్రధాని మోదీ
  • త్రేతాయుగం నుంచి ఇప్పటివరకు రాముడిని ఆరాధిస్తున్నాం: మోదీ
  • రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదు: ప్రధాని మోదీ
  • బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి: మోదీ

14:45 January 22

  • మనదేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం : ప్రధాని మోదీ
  • రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం: ప్రధాని
  • ఈ క్షణం.. దేశప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం: ప్రధాని మోదీ
  • ఈ క్షణం.. మన విజయానికే కాదు.. వినయానికి కూడా సూచిక: మోదీ
  • కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు: మోదీ
  • పవిత్రత, శాంతి, సామరస్యం.. భారత ఆత్మకు ప్రతిరూపం: మోదీ
  • వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం: ప్రధాని మోదీ
  • అత్యున్నతమైన ఆదర్శ వ్యక్తికి ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరిగింది: మోదీ
  • ఇది సాధారణ మందిరం కాదు.. దేశ చైతన్యానికి ప్రతీక.. : మోదీ
  • రాముడు మనదేశ ఆత్మ.. ధైర్యసాహసాలకు ఆయన ప్రతిరూపం : మోదీ

14:30 January 22

  • ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంది: ప్రధాని మోదీ
  • పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నా: ప్రధాని మోదీ
  • ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నా: మోదీ
  • ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారు: మోదీ
  • స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాలపాటు న్యాయపోరాటం చేశాం: మోదీ
  • న్యాయస్థానాల తీర్పు తర్వాతే మన కల సాకారమైంది: మోదీ
  • ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటోంది: ప్రధాని మోదీ
  • ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి: ప్రధాని మోదీ
  • ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించా: ప్రధాని మోదీ
  • ఏపీలోని లేపాక్షిలో ప్రత్యేక పూజలు నిర్వహించా: ప్రధాని మోదీ
  • సాగర్‌ నుంచి సరయూ వరకు రామనామం జపించా: ప్రధాని మోదీ
  • రామనామం.. ఈ దేశప్రజల కణకణంలో నిండి ఉంది: ప్రధాని మోదీ

14:28 January 22

  • ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడు: ప్రధాని మోదీ
  • ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత మన రాముడు వచ్చాడు: మోదీ
  • ఈ శుభ గడియల్లో ప్రజలందరీకీ కృతజ్ఞతలు: మోదీ
  • గర్భగుడిలో ఇప్పుడే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాం: మోదీ
  • మన బాలరాముడు ఇకనుంచి టెంట్‌లో ఉండాల్సిన అవసరం లేదు: మోదీ
  • మన రామ్‌ లల్లా ఇకనుంచి మందిరంలో ఉంటాడు: మోదీ
  • రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు: మోదీ
  • దేశ విదేశాల్లో ఉన్న భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు: మోదీ
  • 2024 జనవరి 22.. సాధారణ తేదీ కాదు.. కొత్త కాలచక్రానికి ప్రతీక: మోదీ
  • బానిస మనస్తత్వం వదిలి సగర్వంగా తలెత్తుకుని చూస్తున్నారు: మోదీ

14:15 January 22

  • రాముడిని కోట్ల గళాలు స్మరించాయి: మోహన్ భగవత్‌
  • రాముడి త్యాగానికి, పరిశ్రమకు నమస్సులు: మోహన్ భగవత్‌
  • రాముడు.. ధర్మం, త్యాగనిరతికి ప్రతీక: మోహన్ భగవత్‌
  • సమన్వయం చేసుకుని ముందుకెళ్లడమే మన ధర్మం: మోహన్ భగవత్‌
  • పేదల సంక్షేమానికి కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టింది: మోహన్ భగవత్‌
  • పవిత్రతతో జీవించాలి.. దానికి సంయమనం అవసరం..: మోహన్ భగవత్‌
  • మనిషికి అత్యాశ ఉండకూడదు: మోహన్ భగవత్‌
  • నాగరికుడు అంటే క్రమశిక్షణతో జీవించిన వ్యక్తే: మోహన్ భగవత్‌
  • 500 ఏళ్లుగా అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నాం: మోహన్ భగవత్‌
  • అయోధ్య రామాలయం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు: మోహన్ భగవత్‌
  • మనకు ప్రేరణ కలిగించి కర్తవ్యం గుర్తుచేసేందుకే రామ్ లల్లా వచ్చాడు: భగవత్‌
  • భారత్‌.. మరోసారి విశ్వగురుగా ఎదగాలి: మోహన్ భగవత్‌

14:12 January 22

  • 500 ఏళ్ల కల నెరవేరింది: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
  • ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైంది: యూపీ సీఎం
  • ఈ అద్భుత ఘట్టాన్ని నేను మాటల్లో వర్ణించలేను: యూపీ సీఎం ఆదిత్యనాథ్
  • ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లు ఎదురుచూసింది: యూపీ సీఎం ఆదిత్యనాథ్
  • అనుకున్నచోటే రామాలయం నిర్మించాం: యూపీ సీఎం ఆదిత్యనాథ్
  • ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారింది: యూపీ సీఎం ఆదిత్యనాథ్
  • త్రేతాయుగంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది: యూపీ సీఎం ఆదిత్యనాథ్
  • అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుంది: యూపీ సీఎం
  • ప్రధాని మోదీ దూరదృష్టి, అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైంది: యూపీ సీఎం
  • అయోధ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు వందలకోట్లు కేటాయించారు: యూపీ సీఎం
  • రాముడు మనకు ఓర్పు బోధించారు: యూపీ సీఎం ఆదిత్యనాథ్
  • రాముడి ప్రాణప్రతిష్ఠ తిలకించిన ఈ తరం ఎంతో అదృష్టవంతులు: యూపీ సీఎం
  • బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుంది: యూపీ సీఎం
  • ఈ కల సాకారం చేయడంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు: యూపీ సీఎం

12:49 January 22

  • స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన బాలరాముడు
  • టీవీల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూసి పులకించిన భక్త కోటి
  • ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో బాలరాముడి దర్శనం
  • చిరు దరహాసం, ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం

12:30 January 22

అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది. రామమందిరంలో వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ చారిత్రక ప్రాణప్రతిష్ఠ క్రతువులో ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘ్ చాలక్‌ మోహన్ భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.

12:15 January 22

శ్రీరామ జన్మభూమి ఆలయంలోకి చేరుకున్న ప్రధాని మోదీ పూజలు నిర్వహించారు.

11:06 January 22

నూతనంగా నిర్మించిన రామమందిరం ప్రాణప్రతిష్ఠ కోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.

10:33 January 22

హెలికాప్టర్లతో పూల వర్షం
అయోధ్య రాముడికి హారతి ఇచ్చే సమయంలో హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. అదే సమయంలో 30 మంది సంగీత కళాకారులతో వివిధ వాయిద్యాలతో శ్రీరాముడిని కీర్తించనున్నారు. ఇప్పటికే అయోధ్యకు వెళ్లే దారిలో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలు భక్తులకు ప్రత్యేక అనుభూతులను పంచాయి. రామాయణ ఘట్టాలను వివరిస్తూ చేసిన నాట్యాలు ఆకట్టుకున్నాయి.

09:13 January 22

అయోధ్యకు తరలివస్తున్న ప్రముఖులు
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అయోధ్య బాటపట్టారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు, సాధువులు ఒక్కొక్కొరుగా రామజన్మ స్థలానికి చేరుకుంటున్నారు. చిత్రపరిశ్రమ నుంచి కొంతమంది నటులు, దర్శకులు సహా అయోధ్యకు వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10:45 గంటలకు అయోధ్యకు రానున్నారు.

ఇప్పటికే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సినీనటులు రజనీకాంత్, పవన్ కల్యాణ్ అయోధ్యకు చేరుకున్నారు. కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్, బాలీవుడ్ సినీ దర్శకుడు మధుర్ భండర్ కర్, నటి కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్, ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా రామజన్మ స్థలానికి చేరుకున్నారు.

06:45 January 22

మరి కొద్ది గంటల్లో శతాబ్దాల కల సాకారం - అమృత ఘడియల్లో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ

Ayodhya Ram Mandir Live Updates : 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరి కొద్ది గంటల్లో రామమందిరం కల సాకారం కానుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. కోట్ల మంది ప్రజల ప్రత్యక్ష, పరోక్ష వీక్షణ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరిస్తున్నారు. అలానే దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొంటున్నారు. పలువురు ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ఇక అయోధ్యలో సంబరాలు మొదలయ్యాయి.

ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగే క్రతువులు ఈ నెల 16వ తేదీన ప్రారంభమై ఆదివారంతో ముగిశాయి. ప్రాణ ప్రతిష్ఠ కోసం శ్రీరామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఇక అయోధ్య నగరం భద్రతా వలయంలోకి వెళ్లింది. పలు కంపెనీల బలగాలతో కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేశారు. భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ దేశాలు ప్రాణ ప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఎదురుచూస్తోంది.

Last Updated : Jan 22, 2024, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details