తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య మందిర నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం! భక్తుల సౌకర్యాలకు ప్రయారిటీ

Ayodhya Ram Mandir Construction Status : అయోధ్యలో రామమందిర పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. ఈ మేరకు శనివారం సమావేశమైన కమిటీ భక్తుల సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేసే ప్రణాళికపై చర్చించింది.

Ayodhya Ram Mandir Construction Status
Ayodhya Ram Mandir Construction Status

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 3:57 PM IST

Updated : Feb 3, 2024, 4:08 PM IST

Ayodhya Ram Mandir Construction Status :అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆలయ నిర్మాణ పనులు తిరిగి మొదలు కానున్నాయి. ఆలయంలోని మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్​ సహా రెండో అంతస్తు పనులు వెంటనే ప్రారంభమవుతాయని మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర శర్మ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఆలయం పార్కోట, 795 మీటర్ల పరిక్రమ గోడ వంటి తదితర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు.

రామమందిర మొదటి అంతస్తు పూర్తయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయం మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మితమవుతోంది. పనులు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ శనివారం సమావేశమైంది. ఈ మీటింగ్​లో భక్తుల సౌకర్యాలు త్వరితగతిన పూర్తి చేయడం సహా రామమందిరం రెండో అంతస్తు నిర్మాణం ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర ఆలయ భవన సముదాయాన్ని పరిశీలించారు.

అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు
మరోవైపు కొత్త మందిరంలో కొలువుదీరని రాముడ్ని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి ఫిబ్రవరి 1 వరకు దాదాపు 25లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఆలయ హుండీకి రూ.11 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో రూ.8 కోట్లు నగదు రూపంలో, రూ.3.5 కోట్లు చెక్కుల రూపంలో వచ్చాయి. ఇందులో ఆన్​లైన్​ విరాళాలు కూడా ఉన్నాయి.

జనవరి 22న నవనిర్మిత భవ్యమందిరంలో రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఆరోజు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు శ్రీరాముడిని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ మహత్తర ఘట్టానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సాధుసంతువులు, ప్రముఖులు సహా ఏడు వేల మంది అతిథులు సాక్షులుగా నిలిచారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 జంటలు ప్రాణప్రతిష్ఠకు అతిథేయులుగా వ్యవహరించారు.

అయోధ్య రామయ్య ఒంటిపై ఉన్న బంగారం ఎంతో తెలుసా? వీటిని ఎవరు చేశారు?

అయోధ్య రామాలయానికి కానుకగా 1.75 కిలోల వెండి చీపురు

Last Updated : Feb 3, 2024, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details