తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 4:23 PM IST

ETV Bharat / bharat

'స్పీకర్​ కుమార్తె గురించి సోషల్ మీడియాలోని ఆ పోస్టులన్నీ డిలీట్ చేయండి'- హైకోర్టు ఆదేశం - Om Birla Daughter UPSC Issue

Om Birla Daughter UPSC Issue : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె అంజలి బిర్లాకు వ్యతిరేకంగా పెట్టిన సోషల్​ మీడియా పోస్ట్​లను తొలగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. తండ్రి ఓం బిర్లా సాయంతో సివిల్స్​కు ఎంపికయ్యారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆమె పరువు నష్టం దావా వేయగా, కోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

Om Birla Daughter UPSC Issue
Om Birla Daughter UPSC Issue (Instagram)

Om Birla Daughter UPSC Issue : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె, ఐఆర్‌‌పీఎస్ అధికారిణి అంజలి బిర్లాపై పెట్టిన సోషల్​ మీడియా పోస్ట్​లను తొలగించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించిది. ఈ మేరకు ఎక్స్, గూగుల్​కు ఆదేశాలు జారీ చేసింది. తన తండ్రి పలుకుబడిని ఉపయోగించి అంజలి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో పాసయ్యారంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. ఇలా ఆరోపణలు చేసిన వారిపై కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.

ఓం బిర్లా కుటుంబంపై కుట్ర
తనపై కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని, వాటిని వెంటనే తొలగించాలని అంజలి బిర్లా పిటిషన్​లో పేర్కొన్నారు. ఆ పోస్టులు తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అంజలి బిర్లా ఆరోపించారు. చాలామంది వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు ప్రచారం చేస్తూ తన వృత్తిని, కుటుంబీకుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, గూగుల్, ఎక్స్, గుర్తుతెలియని సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను చేర్చారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారందరినీ నిలువరించేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అంజలీ బిర్లా తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ ఈ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసర జాబితాలో చేర్చి మంగళవారమే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. ఆ పోస్టులను తొలగించాలంటూ ఎక్స్​, గూగుల్​కు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

ఇటీవలే మహారాష్ట్ర సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు అంజలి. ఆ ఫిర్యాదులో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎక్స్ అకౌంట్ల సమాచారాన్ని సైబర్​ సెల్​కు అందించారు. వారిపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జులై 5న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.

పేదల కోసం మరో 3 కోట్ల ఇళ్లు- 25 వేల గ్రామాలకు రోడ్లు - Union Budget 2024

యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్​ అన్న మోదీ- కాపీ పేస్ట్‌ అంటూ రాహుల్ కౌంటర్​ - union budget 2024

ABOUT THE AUTHOR

...view details