తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేణుకస్వామికి కరెంట్ షాక్‌ ఇచ్చి చిత్రహింస!- దర్శన్ కేసులో విస్తుపోయే విషయాలు- సెల్​ఫోన్​ కోసం గాలింపు చర్యలు - Darshan Case - DARSHAN CASE

Darshan Case Latest Update : కన్నడ నటుడు దర్శన్ తూగదీప అభిమాని రేణుకస్వామి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు బాధితుడికి చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు, రేణుకస్వామికి కరెంట్ షాక్‌ ఇచ్చినట్లు తేలింది. ఈ హత్య కేసులో పోలీసులు తాజాగా కమీడియన్‌ చిక్కన్నకు నోటీసులు జారీ చేశారు. హత్య జరిగిన రోజు దర్శన్‌ తూగదీప వెంట చిక్కన్న ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Darshan Case
Darshan Case (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 9:36 PM IST

Darshan Case Latest Update : రేణుకస్వామి హత్య కేసులో రోజుకొక కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. హత్యకు ముందు బాధితుడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అతడికి కరెంటు షాక్‌ ఇచ్చినట్లు తేలింది. ఇటీవల అరెస్టు చేసిన మండ్యాకు చెందిన కేబుల్‌ వర్కర్‌ ధన్‌రాజ్‌ను విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. నందీశ్‌ అనే వ్యక్తి తనను బెంగళూరులోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లాడని పోలీసుల విచారణలో ధన్‌రాజ్ చెప్పినట్లు తెలుస్తోంది.

కరెంటు షాక్‌ ఇచ్చేందుకు!
అక్కడే రేణుకాస్వామికి ఎలక్ట్రికల్‌ మెగ్గర్‌తో కరెంటు షాక్‌ ఇచ్చేందుకు ఏర్పాటు చేశామని తెలిపినట్లు సమాచారం. దీంతో ఆ పరికరాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పట్టణగెరెలోని షెడ్డులోనే బాధితుడికి చిత్రహింసలు పెట్టారని పోలీసులు గుర్తించారు. తాను శాకాహారినని చెప్పినా, బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించారని తెలిసింది. అనంతరం అతడిపై పవిత్రా గౌడ, దర్శన్‌తోపాటు ఇతరులు దాడి చేసినట్లు సమాచారం. మొత్తంగా బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా వీటిలో ఏడు, ఎనిమిది చోట్ల కాలిన గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు. రేణుకాస్వామిపై మొదట పవిత్రాగౌడ దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను కొట్టవద్దని, మరోసారి ఈ తప్పు చేయనని కాళ్లపై పడి వేడుకొన్నా ఆమె కొట్టిందని నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

సెల్‌ఫోన్‌ కోసం గాలింపు చర్యలు
మరోవైపు హత్య అనంతరం రేణుకాస్వామి ఒంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో పవిత్ర మేనేజర్‌ దేవరాజ్‌ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడని తేలడం వల్ల అతడిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. రేణుకస్వామిని హత్య చేసి కాలువలో పడేసిన చోట పోలీసులు అతడి సెల్‌ఫోన్‌ కోసం గాలిస్తున్నారు. ఇన్‌స్టాలో పవిత్రగౌడకు పెట్టిన అసభ్యకర మెసేజ్‌ హత్యకు దారితీయడంతో సెల్‌ఫోన్‌ లభిస్తే దర్యాప్తు మరింత ముందుకు సాగుతుందని పోలీసులు భావిస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందం విచారణ హాజరుకావాలని కన్నడ నటుడు చిక్కన్నకు నోటీసులు అందజేసింది. హత్య జరిగిన రోజు చిక్కన్న, నిందితుడు దర్శన్‌ వెంట ఉండటం వల్ల అతడిని ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. కేవలం ప్రశ్నించడానికే నోటీసులు ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details