తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు డబ్బులు ఆదా! AI టెక్నాలజీతో ఎలక్ట్రిక్ ట్రాక్టర్- డ్రైవర్​తో పని లేదు! - Driverless Electric Tractor - DRIVERLESS ELECTRIC TRACTOR

Driverless Electric Tractor : డ్రైవర్ లేకుండా ఏఐ టెక్నాలజీతో నడిచే ఓ ఎలక్ట్రిక్ ట్రాక్టర్​ను తయారు చేశాడు పుణెకు చెందిన ఓ యువకుడు. ఈ ట్రాక్టర్ కు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు 10-15 గంటలపాటు నడుస్తుంది. అలాగే రైతుకు డీజిల్, డ్రైవర్ జీతం ఆదాయం అవుతుంది. మరెందుకు ఆలస్యం యువ వ్యాపారవేత్త తయారుచేసిన ట్రాక్టర్ రైతుకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

Driverless Electric Tractor
Driverless Electric Tractor (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 2:25 PM IST

రైతులకు డబ్బులు సేవ్! AI టెక్నాలజీతో ఎలక్ట్రిక్ ట్రాక్టర్- యువకుడి అద్భుత ఆవిష్కరణ (ETV Bharat)

Driverless Electric Tractor :వ్యవసాయంలో రైతులకు వెన్నెముకగా నిలిచే సరికొత్త ట్రాక్టర్​ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి చేశాడు. ఆధునిక డ్రైవర్​లెస్​ టెక్నాలజీకి ఏఐ జోడించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్​ను అవిష్కరించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నేస్తుంది. అలాగే వేరే పనులను సైతం సునాయాసంగా చేసేస్తుంది.

రైతుకు డ్రైవర్ జీతం, డీజిల్ ఖర్చు ఆదా
పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా(25) అనే యువకుడు మగర్ పట్టాలోని వీఐటీ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగంలో చేరాడు. ఆపై 2019లో సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. 2023లో సిద్ధార్థ్ తన పరిశోధనను పూర్తి చేసి వీఆర్​​డీ మోటార్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో ఏఐ బేస్డ్​ డ్రైవర్​లెస్ ట్రాక్టర్లను గుజరాత్, మధ్యప్రదేశ్​లో తయారుచేయడం ప్రారంభించాడు. ఈ ట్రాక్టర్లను సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీంతో రైతుకు డ్రైవర్, డీజిల్ ఖర్చు ఆదా అవుతుంది.

పొలం దున్నుతున్న డ్రైవర్​లెస్​ ఎలక్ట్రిక్​ టాక్టర్​ (ETV Bharat)

అన్నీ స్వదేశీ పరికరాలే
15హెచ్​పీ, 50హెచ్​పీ సామర్థ్యం గల రెండు రకాల ట్రాక్టర్ల సిద్ధార్థ్ కంపెనీలో తయారవుతున్నాయి. ఈ ట్రాక్టర్ తయారీలో వాడిన బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్​ను సోలార్‌ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రాక్టర్​లో మరొక అదనపు బ్యాటరీ ఉంటుంది. దీనికి ఛార్జ్ చేసి అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ఈ ట్రాక్టర్​ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10-15 గంటల వరకు నిర్విరామంగా నడుస్తుంది. ఈ ట్రాక్టర్లు పేటెంట్​ సైతం అందుకున్నాయి. త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈ క్రమంలో రైతుల మేలు కోసం ట్రాక్టర్లను తయారుచేసిన సిద్ధార్థ్​పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఎలక్ట్రిక్​ ట్రాక్టర్​తో ఆవిష్కర్త సిద్ధార్థ్ గుప్తా (ETV Bharat)

'రైతుల కోసం ఏదైనా చేయాలనుకున్నా'
"ఇంజినీరింగ్ చదివేటప్పుడు రైతుల కోసం ఏదైనా చేయాలనుకున్నాను. అందుకోసం చాలా మంది రైతులతో మాట్లాడాను. ఆ తర్వాత అన్నదాతల కోసం డ్రైవర్​లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై పరిశోధన చేశాను. ఈ ట్రాక్టర్ రైతులకు బాగా ఉపయోగపడుతుంది. 15హెచ్​పీ ట్రాక్టర్ ధర రూ.3-4 లక్షలు, 50హెచ్​పీ ట్రాక్టర్ ధర రూ.10-12 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఏఐ బేస్డ్​ డ్రైవర్​లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ట్రయల్ రన్ జరుగుతోంది. త్వరలో ఈ ట్రాక్టర్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఉంది. రైతులకు రోజుకు 1-2 గంటలు మాత్రమే కరెంటు అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో డ్రైవర్​లెస్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్​కు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10-15 గంటలపాటు పనిచేస్తుంది. అలాగే రైతుకు డీజిల్​తో పాటు డ్రైవర్‌ ఖర్చు కూడా ఆదా అవుతుంది." అని సిద్ధార్థ్ గుప్తా తెలిపాడు.

'సిలిండర్ డిప్లిషన్' డివైజ్- గ్యాస్ అయిపోయే 10రోజుల ముందు వార్నింగ్​- కాస్ట్​ రూ.1000లే! - Cylinder Depletion Device

శత్రువులను ఖతం చేసే 'AI రోబో'- ఎనిమీ ఎక్కడ ఉన్నా గురితప్పదు! యుద్ధభూమిలో 360 డిగ్రీల కవరేజ్​! - AI robot soldiers

ABOUT THE AUTHOR

...view details