చిన్న ఘర్షణకు ప్రాణాలు బలి.. ఒక్కసారిగా కుప్పకూలి మృతి - ఉత్తర్‌ప్రదేశ్ న్యూస్
🎬 Watch Now: Feature Video
youth died on the spot: చిన్న ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇద్దరు అన్నాదమ్ములతో గొడవపడిన వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పుర్‌లో జరిగింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. షానవాజ్ అనే వ్యక్తి తన పదేళ్ల కొడుకుతో కలిసి రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఆసిఫ్ అనే వ్యక్తితో ఓ విషయమై గొడవపడ్డాడు. దీనిపై షానవాజ్.. ఆసిఫ్ సోదరుడికి ఫిర్యాదు చేసేందుకు అతడి దుకాణానికి వెళ్లాడు. అయితే, ఆసిఫ్ సోదరుడు సల్మాన్ సైతం షానవాజ్‌పై దాడి చేశాడు. దాడికి గురైన వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్నాదమ్ములిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.