స్కూల్ బ్యాగ్లో నాగుపాము కలకలం.. పుస్తకం కోసం ఓపెన్ చేయగా.. - మధ్యప్రదేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్.. శివపురి జిల్లాలోని విద్యార్థి స్కూల్ బ్యాగ్లో నాగు పాము కలకలం సృష్టించింది. జిల్లాలోని బదౌని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని రోజులాగే బ్యాగ్ వేసుకుని స్కూల్కు వచ్చింది. అయితే తరగతిలో కూర్చున్న బాలిక.. పుస్తకం తీసేందుకు బ్యాగ్ ఓపెన్ చేయగా నాగుపాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయులు భయపడ్డారు. కాసేపటి తర్వాత సర్పాన్ని ఖాళీ ప్రదేశంలోకి విడిచిపెట్టేశారు.