Prathidwani: నీటి వనరులను కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడం ఎలా? - నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Prathidwani: హైదరాబాద్ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యం సమస్య వీడటం లేదు. ఇందులో రోజూ 376 ఎల్‌ఎండీల మురుగు చేరుతోంది. భాగ్యనగరం పొడవునా పారుతున్న మూసీ నదిలోనూ కాలుష్యం కోరలు చాస్తోంది. ఇక్కడ పీసీబీ నిర్దేశించిన పరిమితి కంటే 10రెట్లు అధికంగా కాలుష్యం పెరిగిపోయింది. రసాయనవ్యర్థాలు, మురుగునీరు, వైరస్లు, బ్యాక్టీరియాలు.. ఈ జల వనరులను ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు వెచ్చించి, చేపడుతున్న నీటిశుద్ధి కార్యక్రమాల శ్రమంతా మురుగులో కొట్టుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ పరిధిలో ఉన్న నీటి వనరులను కాలుష్యం బారి నుంచి కాపాడుకోవడం ఎలా? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.