Prathidhwani On Electoral Reforms: ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లులో ప్రధాన అంశాలేంటి? - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Prathidhwani On Electoral Reforms: ఎన్నికల సంస్కరణ దిశగా కేంద్రం అడుగు ముందుకేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ఓటరు ఐడీని ఆధార్‌తో అనుసంధానించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో అక్రమాల నిరోధం లక్ష్యంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి ఈసీ సూచించిన సవరణల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బోగస్ ఓట్ల ఏరివేత తోపాటు ఎన్నికల ఖర్చుల వెల్లడిలో పారదర్శకతకు ఇది సానుకూల పరిణామం. ఈ నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ బిల్లులో ప్రధానమైన అంశాలేంటి? బిల్లు ఆమోదం పొందితే ఈసీ బలం పెరుగుతుందా? ఈ సంస్కరణలతో ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత ఏ మేరకు పెరుగుతుంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.