ప్రతిధ్వని: పల్లెలపై కరోనా పంజా.. వైద్య భరోసా ఎలా? - పల్లెల్లో కరోనాపై ప్రతిధ్వని కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11797047-583-11797047-1621265808888.jpg)
పల్లె తల్లడిల్లుతోంది. కరోనా పంజాతో ఊర్లన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మొదటి వేవ్‌లో ఊపిరి పీల్చుకున్నా.. రెండ్‌వేవ్ తాకిడికి కనివినీ ఎరగని సంక్షోభాన్ని చూస్తున్నాయి. పాజిటివ్ కేసులు, మరణాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉన్న పల్లె వైద్యంపై ఇది మోయలేని భారాన్ని మోపింది. చివరకు గిరిజనప్రాంతాలు కూడా ఈ మహమ్మారి ముట్టడిలో గజగజ వణుకుతున్నాయి. కరోనా కేసులు నమోదు కాని గ్రామాలేవి అంటే... చెప్పలేని దైన్యం. వ్యాధి నిర్ధరణ పరీక్షల నుంచి చికిత్స వరకు పల్లెసీమల కష్టనష్టాలు వర్ణనాతీతం. ఈ పరిస్థితుల్లో గ్రామీణ భారతానికి భరోసా ఇచ్చేది ఎలా? పల్లెజనాన్నిఎలా కాపాడు కోవాలి? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : May 17, 2021, 9:53 PM IST