ప్రతిధ్వని: మానవ అక్రమ రవాణా అడ్డుకట్టలో మన వ్యవస్థల సామర్థ్యం ఎంత? - debate on human trafficking
🎬 Watch Now: Feature Video
పేదరికం, నిరుద్యోగం, నిస్సహాయత.. మనుషుల అక్రమరవాణా సమస్యకు మూలాలు. బతుకుదెరువు కోసం పట్టణాలకు వలసపోతున్న పేదలు, ఉన్న ఊళ్లో ఉపాధి లభించక పరాయిదేశం పోతున్న కూలీలు, నిరుద్యోగులు ఏటా వేల సంఖ్యలో అక్రమరవాణాకు గురవుతున్నారు. నమ్మినవారి చేతుల్లో మోసపోతున్న వారు కొందరు.. ఉద్యోగం ఆశతో భంగ పడుతున్న వారు ఇంకొందరు. ఇలాంటి బాధితుల్లో మహిళలు, బాలికలే అధికం. దళారుల మాయమాటల వలలో చిక్కి జీవితాలు చెల్లాచెదరవుతున్న అభాగ్యులకు చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఎంత? మానవ అక్రమరవాణా (నివారణ, సంరక్షణ, పునరావాసం) బిల్లు-2021 కల్పిస్తున్న ఆశలు ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.