prathidwani: తెరపైకి ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పాఠశాలల రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం కసరత్తు జరుపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పదోన్నతులు, బదిలీల కోసం వినతిపత్రాలు ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాలతో రేషనలైజేషన్ ప్రస్తావన తెస్తూ.. అభిప్రాయాలు సేకరిస్తోంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఎంత..? రేషనలైజేషన్‌పై ఉపాధ్యాయుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? రేషనలైజేషన్ వల్ల పాఠశాల విద్యలో ఎలాంటి మార్పులు వస్తాయి.? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.